జాతీయ వార్తలు

దుమారం రేపిన వీడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, మే 30: ప్రముఖ నేపథ్య గాయని లతా మంగేష్కర్‌తోపాటు క్రికెట్ దిగ్గజం సచిన్ తెండూల్కర్‌ను అనుకరి స్తూ హాస్య నటుడు తన్మయి భట్ రూపొందించిన వీడియోపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో తన్మయి భట్‌పై ఫిర్యాదు దాఖలవడంతో ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై శివసేన, బిజెపి, మహారాష్ట్ర నవనిర్మాణ సేన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ, తన్మయి భట్‌తోపాటు ఎఐబి అనే ఆన్‌లైన్ కామెడీ గ్రూపుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశా యి. దేశం గర్వించదగిన సచిన్, లతా మంగేష్కర్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ రూపొందించిన తన్మయి భట్‌పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎంఎన్‌ఎస్, అతను కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరించింది.
‘సచిన్ వర్సెస్ లతా సివిల్ వార్’ అనే పేరుతో రూపొందించిన ఈ వీడియోను తన్మయి భట్ ఈ నెల 26వ తేదీన ఫేస్‌బుక్‌లో పోస్టు చేశాడు. దీనిపై బాలీవుడ్ నుంచి కూడా తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.