జాతీయ వార్తలు

ఆఫ్రికన్ల భద్రత మా ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ. మే 30: దేశంలో ఆఫ్రికన్లపై వరుస దాడుల నేపథ్యంలో వారిలో నమ్మకం కలిగించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఆఫ్రికన్ల భద్రత, సురక్ష తమ ప్రధాన విధానమని విదేశాంగ కార్యదర్శి ఎస్.జయశంకర్ అన్నారు. కాంగో జాతీయుడి హత్య, ఆఫ్రికన్లపై కేసుల నమోదు నేపథ్యంలో జయశంకర్ సోమవారం ఆఫ్రికన్ విద్యార్థుల బృందాన్ని కలిసి చర్చించారు. ఆఫ్రికన్లకు రక్షణ కల్పించటం తమ విధానమని జయశంకర్ వారికి హామీ ఇచ్చారంటూ విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్ ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. జయశంకర్‌తో సమావేశం సందర్భంగా ఆఫ్రికన్ విద్యార్థులు తమకు ఎదురవుతున్న పలు సమస్యలను ఆయనతో ప్రస్తావించారు. వీసా సంబంధిత అంశాలే కాకుండా, తమ ఆవాసానికి కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తోందని వారు తెలిపారు. దీనికితోడు తమతో పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దుర్భరంగా ఉందని.. వారు సున్నితంగా వ్యవహరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి బృందం జయశంకర్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుందని జయశంకర్ వారికి హామీ ఇచ్చారు. మరోవైపు హత్యకు గురైన కాంగో జాతీయుడు మసోండా కెటాడా కుటుంబం ఢిల్లీకి చేరుకుంది. విమానాశ్రయంలోనే విదేశాంగశాఖ సంయుక్త కార్యదర్శి బీరేందర్ యాదవ్ వారిని కలుసుకుని.. కేసు విచారణ త్వరితంగా పూర్తి చేసి, దోషులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మసోండా మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని వికాస్ స్వరూప్ పేర్కొన్నారు.