జాతీయ వార్తలు

వాద్రాకు గిఫ్టుగా లండన్‌లో ఫ్లాట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మే 30: ఓ ఆయుధ డీలర్ నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకు గిఫ్టుగా లండన్‌లో ఫ్లాట్ దక్కిందన్న కథనాలు సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఓ ఆంగ్ల వార్తా సంస్థలో వచ్చిన కథనాలపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ దృష్టి సారించింది. 2009లో రాబర్ట్‌వాద్రాకు లండన్‌లో బినామీ పేరుతో ఫ్లాట్ దక్కినట్టు చెబుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించపనిలో ఎన్‌ఫోర్స్‌మెంట్, ఆదాయపన్ను అధికారులు నిమగ్నమై ఉన్నారు. వాద్రాకు గిఫ్టు ఇచ్చినట్టు ఆరోపణలున్న మనోజ్ అరోరా మధ్య జరిగిన ఇమెయిల్స్‌పై విచారణ జరపనున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు గత నెలలో భండారీకి చెందిన పలు సంస్థలపై దాడులు జరిపారు. ఈ సందర్భంగా వాద్రా, అరోరా మధ్య ‘సంబంధాలు’ బయటపడ్డాయి. లండన్‌లోని ఫ్లాట్ మరమ్మతులు, చెల్లింపులకు సంబంధించి ఇద్దరి మధ్య సాగిన ఇమెయిల్స్ బయటపడ్డాయి. లండన్‌లోని బ్రయన్‌స్టోన్ స్క్వేర్, 12 ఎల్లిర్టన్ హౌస్ 2009 అక్టోబర్‌లో 19 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్టు వార్తా సంస్థ కథనం. ఫ్లాట్‌ను 2010 జూన్‌లో అమ్మినట్టు తేలింది. సోనియా అల్లుడు రాబర్ట్ వాద్రా, మనోజ్ అరోరా మధ్య సాగిన ఇమెయిల్స్ లండన్‌లోనే ఉన్న సమీత్ చద్దాకు చేరేవి. చద్దా ఎవరోకాదు భండారీ బంధువే. ఆఫ్‌సెట్ ఇండియా సొల్యూషన్స్ (ఓఐఎస్) యజమాని భండారీపై త్వరలోనే ఇంటిలిజెన్స్ బ్యూరో ఉచ్చు బిగించనుంది. రాబర్ట్ వాద్రాకు ఫ్లాట్ గిఫ్టుపై ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని అధికారులు స్పష్టం చేశారు.