జాతీయ వార్తలు

బాంబు దాడులతో దద్దరిల్లిన ఇరాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగ్దాద్, మే 30: ఇరాక్ రాజధాని నగరం బాగ్దాద్, దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో గల వాణిజ్య స్థలాలను లక్ష్యంగా చేసుకొని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు సోమవారం జరిపిన బాంబు దాడుల్లో 24 మంది మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు. ఉత్తర బాగ్దాద్‌లో షియాల ప్రాబల్యం గల ఒక వాణిజ్య ప్రాంతంలోని ఒక చెక్‌పాయింట్‌లోకి ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన కారుతో దూసుకెళ్లాడు. ఈ పేలుళ్లలో ఎనిమిది మంది పౌరులు, ముగ్గురు సైనికులు మృతి చెందారని, 14 మంది గాయపడ్డారని ఒక పోలీసు అధికారి చెప్పారు. తర్మియా పట్టణంలోని మార్కెట్‌లోకి మరో కారుబాంబర్ దూసుకెళ్లడంతో ఏడుగురు పౌరులు, ముగ్గురు పోలీసులు మృతి చెందారు. 24 మంది గాయపడ్డారు. బాగ్దాద్‌కు తూర్పున గల సాదర్ నగరంలోని మార్కెట్‌లోకి బాంబులున్న మోటర్ సైకిల్ దూసుకెళ్లడంతో ముగ్గురు మృతి చెందగా, పది మంది గాయపడ్డారు. మృతుల సంఖ్యను వైద్యాధికారులు కూడా ధ్రువీకరించారు. కాగా, షియా మిలీషియా సభ్యులు, ప్రభుత్వ అధికారులను లక్ష్యంగా చేసుకొని బాంబు దాడులకు పాల్పడినట్లు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది.