జాతీయ వార్తలు

పెరిగిన ధాన్యం మద్దతు ధర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: ఖరీఫ్‌లో ధాన్యం కనీస మద్దతు ధరను మరో అరవై రూపాయలు పెంచేందుకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తమ ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఇంతకుముందు ఖరీఫ్ ధాన్యం కనీస మద్దతు ధరను క్వింటాలుకు 1,410 నిర్ణయించటం తెలిసిందే. అయితే కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఈరోజు అదనంగా మరో అరవై రూపాయలు పెంచేందుకు అంగీకరించటంతో 2016-17 సంవత్సరానికి ధాన్యం కనీస మద్దతు ధర 1,470 రూపాయలకు చేరుకున్నది. పప్పు ధాన్యాలు, ఆయిల్ సీడ్స్ మినహా మిగతా అన్ని పంటలకు ప్రభుత్వ సలహా సంఘం సిఫారసు చేసిన కనీస మద్దతు ధరలకు కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం తమ ఆమోదం తెలిపింది. 2016-17 ఖరీఫ్ సీజన్‌కు పప్పు ధాన్యాల కనీస మద్దతు ధరను ఇదివరకే బాగా పెంచినందున ఇప్పుడు పెంచలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కనీస మద్దతు ధరను ఇదివరకే పెంచినందున ఖరీఫ్ సీజన్‌లో పప్పు ధాన్యాల ఉత్పత్తి బాగా పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధరను ఇదివరకే క్వింటాలుకు నాలుగు వందల రూపాయలు పెరిగిందనీ, పప్పు ధాన్యాల మాదిరిగా నూనె గింజల కనీస మద్దతు ధరను కూడా ఇదివరకే బాగా పెంచటం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పత్తి కనీస మద్దతు ధరను కూడా అరవై రూపాయలకు పెంచటంతో మధ్యతరహా స్టేపల్ పత్తి కనీస మద్దతు ధర 3,860 రూపాయలకు, పొడుగు పత్తి కనీస మద్దతు ధర 4,160 రూపాయలకు పెరిగింది.