జాతీయ వార్తలు

పెంచిన పెట్రో ధరలను ఉపసంహరించుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూన్ 1: పెట్రోలు, డీజిలు ధరలను భారీగా పెంచుతూ పెట్రోలియం కంపెనీలు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బుధవారం డిమాండ్ చేశారు. కాగా, సిపిఎం సైతం పెట్రో ధరల పెంపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మోదీ సర్కారు జరపుతున్న వృథా ఖర్చుకు ప్రజలనుంచి ముక్కుపిండి వసూలు చేయడమే ఈ చర్య అని దుయ్యబట్టింది. ‘చమురు మార్కెటింగ్ కంపెనీలు అనుసరిస్తున్న ధరలను నిర్ణయించే విధానం తప్పని నేను అనేక సందర్భాల్లో స్పష్టం చేశాను. ఈ తప్పుడు విధానం ఆధారంగానే ఇటీవల పెట్రోలు, డీజిలు ధరలను పెంచడం జరిగింది’ అని జయ ఒక ప్రకటనలో పేర్కొంది. డాలరుతో రూపాయి మారకం విలువ ఆధారంగా నెలకు రెండుసార్లు పెట్రో ధరలను నిర్ణయించే విధానం సరయిన విధానం సరికాదని పెట్రోలు, డీజిలు ధరలను లీటరుకు 2 రూపాయలకు పైగా పెంచుతూ పెట్రోలియం మార్కెటింగ్ కంపెనీలు తాజాగా తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఆమె అన్నారు. దీనివల్ల సరకు రవాణా చార్జీలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతాయని, ఫలితంగా సామాన్యుడిపై భారం పడుతుందని ఆమె అంటూ చమురు మార్కెటింగ్ కంపెనీలు ప్రకటించిన ఈ పెంపును తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వం తాను అదికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆర్భాటంగా వేడుకలు జరుపుకొంటున్న సమయంలో ప్రజలపై ఈ అదనపు భారం మోపారని, ఈ వృథా ఖర్చుకోసం జనం మూల్యం చెల్లించేలా చేశారని సిపిఎం న్యూఢిల్లీలో విమర్శించింది. దేశంలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుని ఉందని, డీజిలు ధరలను భారీగా పెంచడంవల్ల ఈ సంక్షోభం మరింత తీవ్రమవుతుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై సుంకాలను రెగ్యులర్‌గా పెంచడం ద్వారా లాభాలు ఆర్జిస్తోందని, గత రెండేళ్ల కాలంలో అయిదుసార్లు వరసగా ఎక్సైజ్ సుకాలను పెంచారని ఆ పార్టీ గుర్తు చేసింది. ఓ వైపు సంపన్నులకు రాయితీలు కల్పిస్తూ, మరోవైపు ప్రజలపై భారం మోపడం ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని సిపిఎం ఆ ప్రకటనలో తెలిపింది.

విద్యార్థులకు ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లను అందజేస్తున్న జయలలిత