జాతీయ వార్తలు

‘తలాక్’ను వ్యతిరేకిస్తున్న ముస్లిం మహిళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: మూడుసార్లు నోటి మాటగా తలాక్ చెప్పి విడాకులు తీసేసుకోవడాన్ని దేశంలోని ముస్లిం మహిళలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పూర్తిగా నిషేధించాలని కోరుతూ వారు పోరాటానికి సైతం సిద్ధమవుతున్నారు. భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ (బిఎంఎంఏ) సంస్థ నేతృత్వంలో జరుగుతున్న ఈ పోరాటంలో భాగంగా ఈ ట్రిపుల్ తలాక్‌ను నిషేధించాలని కోరే ఒక పిటిషన్‌పై 50 వేలకు పైగా ముస్లింలు ఇప్పటికే సంతకాలు చేశారు. ట్రిపుల్ తలాక్ ముస్లింల పవిత్ర గ్రంథమైన ఖురాన్‌కు వ్యతిరేకమైందని ఈ ఆన్‌లైన్ పిటిషన్ అంటోంది. ముస్లింలలో ఈ ట్రిపుల్ తలాక్ విధానాన్ని పూర్తిగా నిషేధించాలని 50వేలకు పైగా ముస్లిం యువతీ యువకులు కోరుతున్నారని ప్రస్తుతం తాము సాగిస్తున్న ఉద్యమంపై మాట్లాడుతూ బిఎంఎంఏ సహ వ్యవస్థాపకురాలు జకియా సోమా చెప్పారు. తమ పోరుకు మద్దతు ఇవ్వాలని తమ సంస్థ జాతీయ మహిళా కమిషన్‌ను కోరిందని కూడా ఆమె చెప్పారు. నోటిమాటతో ఏకపక్షంగా విడాకులు ఇచ్చే విధానాన్ని చట్టపరంగా నిషేధించాలని ముస్లిం మహిళలు కోరుంటున్నట్లు మా అధ్యయనంలో తేలింది. ‘సీకింగ్ జస్టిస్ వితిన్ ఫ్యామిలీ’ (కుటుంబం లోపల న్యాయాన్ని కోరుతూ) పేరుతో తాము నిర్వహించిన జాతీయ సర్వేలో 92 శాతానికి పైగా ముస్లిం మహిళలు తమ జీవితాలను, తమ పిల్లల జీవితాలను నాశనం చేసిన ఈ విధానానికి శాశ్వతంగా ముగింపు పలకాలని కోరుకుంటున్నట్లు తేలింది. నోటిమాటతో విడాకులిచ్చే పద్ధతితో పాటుగా నిఖా హలాలా (పెళ్లిపేరుతో జరిగే వ్యాపారం) సైతం రద్దు చేయాలని వారంతా గట్టిగా కోరుతున్నారు’ అని జాతీయ మహిళా కమిషన్‌కు రాసిన లేఖలో ముస్లిం మహిళల హక్కులకోసం పోరాడే ఈ స్వచ్ఛంద సంస్థ తెలిపింది.
తలాక్ పద్ధతిని రద్దు చేయాలని కోరుతూ జరుగుతున్న పోరాటంపై ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కూడా అయిన మార్కండేయ కట్జూ తన ట్విట్టర్‌లో స్పందిస్తూ ‘ముల్లాలంతా ఏమయి పోయారు? ఈ దారుణాలకు వ్యతిరేకంగా వాళ్లు ఏమీ చేయలేరా?’ అని ప్రశ్నించారు. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని గట్టిగా కోరిన ఆయన షరియా చట్టం ముస్లింలను వెనుకబడిన వారిగా ఉంచుతోందని అన్నారు. ‘ముస్లింలలో నోటిమాటతో తలాక్ చెప్పడానికి నేను పూర్తిగా వ్యతిరేకం. ఉమ్మడి పౌరస్మృతి ఉండాలనే డిమాండ్‌ను నేను సమర్థిస్తున్నాను’ అని అంతకుముందు కట్జూ తన అధికారిక ఫేస్‌బుక్ పేజిలో వ్యాఖ్యానించారు.
‘ట్రిపుల్ తలాఖ్’కు బలయిన ఓ ముస్లిం మహిళ ఒకరు ఇటీవల ఇప్పుడున్న ఈ విడాకుల పద్ధతిని రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టు గడప ఎక్కారు. స్పీడ్‌పోస్టు ద్వారా విడాకుల లేఖ అందుకున్న తర్వాత జైపూర్‌కు చెందిన పాతికేళ్ల అఫ్రీన్ రెహ్మాన్ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఒక పెళ్లిళ్ల పోర్టల్ ద్వారా 2004లో తనకు పెళ్లయిందని, అయితే పెళ్లయిన రెండు మూడు నెలలకే అత్తింటివారు తనను వరకట్నం కోసం వేధించడం ప్రారంభించారని, మానసికంగా వేధింపులు గురి చేశారని ఆమె తెలిపింది. మస్లింలలో బహుభార్యాత్వం, ట్రిపుల్ తలాక్, నిఖా హలాలను చట్టంబద్ధం చేసే ముస్లిం వివాహ చట్టంలోని సెక్షన్-2 రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ షయారా బానో అనే ముస్లిం మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. ఇదిలా ఉండగా దేశంలో మహిళల స్థితిగతులను సమీక్షించడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సైతం ముస్లింలలో ఈ ట్రిపుల్ తలాక్‌ను, బహుభార్యత్వాన్ని నిషేధించాలని తన నివేదికలో సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.