జాతీయ వార్తలు

యూపిలో గెలుపే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 1: ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బిజెపి జాతీయ కార్యవర్గం అలహాబాద్‌లో ఈ నెల 12, 13తేదీలలో సమావేశం కానుంది. అసోంలో ఘనవిజయంతో ఊపుమీదున్న బిజెపి దేశంలోనే అతిపెద్ద రాష్టమ్రైన యూపిలో సొంతగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు మొదలు పెట్టింది.
అందుకే జాతీయ కార్యవర్గ సమావేశాలు యుపిలో ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. దేశంలోనే ఎక్కువ లోక్‌సభ సీట్లువున్న ఉత్తరప్రదేశ్‌లో గత సార్వత్రిక ఎన్నికల్లో బిజెపి 71 స్థానాలు గెలుచుకుంది. ఈ సారి యూపి లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు కోసం పార్టీ అన్ని ప్రయత్నాలు చేస్తూంది. కాగా ఈ సమావేశానికి పార్టీ కార్యవర్గ సభ్యులు, వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల బిజెపి అధ్యక్షులు హాజరవుతారు. అలాగే కేంద్ర మంత్రులు, బిజెపి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతారు. దేశ వ్యాప్తంగా పార్టీ మరింత బలోపేతం లక్ష్యంగా యూపి సమావేశం జరుగుతోంది. ప్రధాని నరేంద్రమోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్‌షా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. చివరిసారి ఉత్తరప్రదేశ్‌లో 2011లో బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశం తర్వాత ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు ఏర్పాటు చేయడం ఇదే మొదటిసారి. 2012 యూపి అసెంబ్లీ ఎన్నికల్లో 403 స్థానాల్లో బిజెపికి కేవలం 41 సీట్లే వచ్చాయి. 2013లో ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ ఇన్‌ఛార్జ్‌గా అమిత్ షా నియమితులయ్యాక ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. సాధారణ ఎన్నికల్లో 80 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 73 (బిజెపికి 71, అప్నాదళ్ 2)సీట్టు కైవసం చేసుకుని చరిత్రను తిరగరాసింది. దీంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గద్దెనెక్కాలని ఉవ్విళ్లూరుతోంది. సామాజిక వర్గాల సమీకరణలపై అధ్యక్షుడు అమిత్ షా ఇప్పటికే దృష్టి సారించారు. యూపిలో ప్రభుత్వం ఏర్పాటు చేయడం ద్వారా రాజ్యసభలో సంఖ్య పెంచుకోవచ్చని పార్టీ భావిస్తోంది. కాశ్మీర్, జార్ఖండ్, అసోం రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాడంలో కీలక పాత్ర పోషించిన పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌కు యూపి బాధ్యతలు అప్పగించే అవకాశలు కనిపిస్తున్నాయి. అలాగే కొన్ని రాష్ట్రాల పార్టీ అధ్యక్షులను కూడా కార్యవర్గ సమావేశానికి ముందుగానే ప్రకటించేందుకు అధిష్ఠానం కసరత్తుచేస్తోంది.

గోవధకు వ్యతిరేకంగా
ఆన్‌లైన్ ప్రచారం జరగాలి
కేంద్ర మంత్రి మేనక పిలుపు
జూలనూ నిషేధించాలని ఉద్ఘాటన

న్యూఢిల్లీ, జూన్ 1:గోవధను నిషేధించడానికి దేశవ్యాప్తంగా ఆన్‌లైన్ ప్రచారం జరగాల్సిన అవసరం ఎంతో ఉందని కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి మేనకా గాంధీ పిలుపునిచ్చారు. అలాగే దేశ వ్యాప్తంగా జంతు ప్రదర్శన శాలలను (జూలు) నిషేధించాలని ఉద్ఘాటించారు. గోవధను అరికట్టేందుకు తాను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నానని చెప్పిన మేనక ఈ సమస్యకు మూల కారణం ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను పూర్తిగా నిషేధించక పోవడమేనని చెప్పారు. దీన్ని నిషేధించాలని ఆరోగ్య శాఖ మంత్రిని ఎప్పటికప్పుడు కోరుతూనే ఉన్నానన్నారు. అదే జరిగితే చంపేయడానికి గోవులను విక్రయించడం జరగదన్నారు. జంతు ప్రదర్శనశాలలు ఏ మాత్రం పిల్లలకు వినోద కేంద్రాలుగా పని చేయడం లేదని..వీటిని సంఘ వ్యతిరేక శక్తులు తమ అనైతిక కార్యకలాపాలకు ఉపయోగించుకుంటున్నారని మేనక అన్నారు. భూమీద జంతు ప్రదర్శన శాలలు ఉండటం నకరమని, వీటిలో బంధించిన అమాయక ప్రాణుల్ని చూడటానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆటపట్టించడం దారుణమన్నారు.