జాతీయ వార్తలు

-పఠాన్‌కోట్‌పై దాడి వ్యవహారం- పాక్‌కు ఎన్‌ఐఏ చీఫ్ క్లీన్‌చిట్‌పై దుమారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూన్ 3: పఠాన్‌కోట్ దాడిని కొనసాగించడంలో పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్‌కు సాయపడ్డం వెనుక పాక్ ప్రభుత్వం లేదా దాని ఏజన్సీకి హస్తం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవంటూ జాతీయ దర్యాప్తు ఏజన్సీ(ఎన్‌ఐఏ) చీఫ్ చేసినట్లుగా చెప్తున్న ప్రకటన భారత్, పాకిస్తాన్‌ల మధ్య కొత్త వివాదానికి తెరదీసింది. కాగా, దీనిపై కేంద్ర ప్రభుత్వం వివరణ ఇస్తూ ఈ దాడిలో పాక్‌కు చెందిన వారి హస్తం ఉన్న విషయం అందరికీ తెలిసిన విషయమేని స్పష్టం చేసింది. ఎన్‌ఐఏ చీఫ్ శరద్ కుమార్ చేసినట్లుగా చెబుతున్న ఆ ప్రకటనపై ఆ సంస్థ సైతం వెనక్కి తగ్గినప్పటికీ పాక్పభుత్వం మాత్రం ఆయన వ్యాఖ్యలు ఈ విషయంలో దీర్ఘకాలంగా తాము చేస్తున్న వాదనను సమర్థిస్తున్నాయని చెప్పుకొంది. ఒక టెలివిజన్ చానల్‌కు శరద్ కుమార్ ఇచ్చినట్లుగా చెప్తున్న లిఖిత పూర్వక ఇంటర్వ్యూపై ఈ మొత్తం వివాదం మొదలైంది. ‘ పఠాన్ కోట్ దాడి సాగించడానికి జైషే మహమ్మద్‌కు, దాని చీఫ్ మసూద్ అజర్ లేదా ఆయన అనుచరులకు పాక్ ప్రభుత్వం లేదా పాకిస్తానీ ప్రభుత్వ ఏజన్సీ కానీ సాయపడినట్లు చూపే సాక్ష్యమైదీ ఇప్పటివరకు లేదు’ అని శరద్ కుమార్ ఆ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అయితే పఠాన్‌కోట్ దాడులకు సంబంధించి కుమార్ చేసినట్లుగా చెప్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఎన్‌ఐఏ ఆ తర్వాత ఒక ప్రకటన జారీ చేసింది. ఆయన ప్రకటనను వక్రీకరించారని కూడా అది పేర్కొంది.
కాగా, ఈ వివాదంపై శుక్రవారం విదేశాంగ మంత్రిత్వ శాఖ సైతం స్పందిస్తూ ఎన్‌ఐఏ డైరెక్టర్ జనరల్ ఇప్పటికే ఒక వివరణ ఇచ్చారని, ‘పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌పై దాడిలో పాకిస్తానీల ప్రమేయం ఉందనే విషయం అందరూ అంగీకరించిన వాస్తవం’ అన్న ప్రభుత్వ వైఖరిని ఏజన్సీ వివరించిందని తెలిపింది. ‘దర్యాప్తులు ఇంకా కొనసాగుతున్నాయి. పాకిస్తానీ సంయుక్త దర్యాప్తు బృందం భారత్ సందర్శించినప్పుడు తనకు కావలసిన సాక్ష్యాధారాలనన్నిటినీ సేకరించిందని, ఈ బృందం తిరిగి వచ్చిన తర్వాత ఈ దాడిపై దర్యాప్తు పురోగతిని సమీక్షించాల్సిన సమయం వచ్చిందని గత ఏప్రిల్‌లో న్యూఢిల్లీలో భారత్, పాక్ విదేశాంగ శాఖ కార్యదర్శులు సమావేశమైనప్పుడు మన విదేశాంగ కార్యదర్శి పాక్ కార్యదర్శికి తెలియజేయడం జరిగిందని విదేశాంగ శాఖ ప్రతినిధి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాకిస్తాన్‌లో సమగ్ర దర్యాప్తు జరపాలని కోరుతూ రెండు లేఖల ద్వారా పాక్ అధికారులకు అవసరమైనంత సమాచారం అందించడం కూడా జరిగిందని ఆయన అంటూ, దీనిపై పాక్‌నుంచి తదుపరి స్పందన, సమాచారం కోసం ఎదురు చూస్తున్నామని, ఈ పరిస్థితిలో దీనిపై ఊహాగానాలు చేయడం సరికాదని ఆయన అన్నారు.కాగా, ఎన్చ్ఫీ పాక్‌కు, దాని ఏజన్సీలకు క్లీన్‌చిట్ ఇవ్వడంతో ఉగ్రవాదంపై భారత్ పోరు దేశీయంగా, అంతర్జాతీయంగా బలహీనమయి పోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా శుక్రవారం విలేఖరుల సమావేశంలో మోదీ సర్కారుపై ధ్వజమెత్తారు.