జాతీయ వార్తలు

అష్టదిగ్బంధనంలో కైరానా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జూన్ 17: ఉత్తరప్రదేశ్‌లోని కైరానాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. పట్టణం నుంచి వలస వెళ్లిపోయిన హిందూ కుటుంబాలను తిరిగి వెనక్కి రప్పించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనాల్సి వస్తుందని బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ యూపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో దీనే్న ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రభుత్వాన్ని ఎండగతామని ఆయన వెల్లడించారు. ముజాఫర్‌నగర్‌లో 2013లో జరిగిన అల్లర్ల కేసులో నిందితులుగా ఉన్న సంగీత్ సోమ్, సమాజ్‌వాదీ పార్టీ నేత అతుల్ ప్రధాన్‌లు పోటాపోటీగా ర్యాలీలు చేపట్టారు. అయితే నిషేధాజ్ఞలు అమలులో ఉండడంతో షాలీ జిల్లా సరిహద్దులోనే వాటిని ఆపేశారు. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కైరానాకు రాకపోకలు నిషేధించారు. సాయుధ బలగాలను రంగంలోకి దించారు. పట్టణం వదలి వెళ్లిపోయిన హిందువులను తిరిగి స్వస్థలానికి రప్పించకపోతే బిజెపి కార్యకర్తలే ఆ పనిచేయాల్సి ఉంటుందని సోమ్ తెలిపారు. దీంతో షాలీ జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నేరస్తులకు భయపడి కేవలం మూడు కుటుంబాలే వలస వెళ్లినట్టు వారు గుర్తించారు. సోమ్ ఆరోపణలపై సమాజ్‌వాదీ పార్టీ అధికార ప్రతినిధి, సీనియర్ మంత్రి శివ్‌పాల్ యాదవ్ తీవ్రంగానే స్పందించారు. వలసలను సాకుగా చూపించి బిజెపి మత రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 2017 ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతోనే ఇదంతా సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు. కైరానాలో వాస్తవ పరిస్థితులు తెలుసుకోడానికి ఐదుగురు రాజకీయ నేతలతో ఓ కమిటీ అక్కడ పర్యటించాలని ఆయన ప్రతిపాదించారు.‘ప్రమోద్ కృష్టం, స్వామి కల్యాణ్, నారాయ్ గిరి, స్వామి చిన్మయానంద్, స్వామీ చక్రపాణిలు అక్కడ పర్యటించి వాస్తవాలు ఏమిటో నివేదించాలి’అని యాదవ్ స్పష్టం చేశారు. బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్ తన మద్దతుదారులతో కైరానాకు భారీ ర్యాలీ తలపెట్టారు. అయితే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో సరిహద్దులోనే ఆపేశామని మీరట్ జిల్లా కలెక్టర్ పంకజ్ యాదవ్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా భారీగా పోలీసు బలగాలు మోహరించాయి.
144వ సెక్షన్‌ను అమలు చేస్తున్నామని ఎవర్నీ అనుమతించడం లేదని షాలీ జిల్లా మెజిస్ట్రేట్ సుజిత్ కుమార్ తెలిపారు. కైరానా పట్టణంతో పాటు జిల్లా అంతటా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నామన్నారు. సభలు, సమావేశాలు, రాజకీయ నాయకుల పర్యటనలను అనుమతి ఇవ్వడం లేదు. కైరానాకు వచ్చే దారులన్నింటినకీ మూసేశారు. కాగా నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున ‘నిర్భయ్’ర్యాలీని వాయిదా వేసుకున్నామని, 15 రోజుల్లో ఊరు విడిచి వెళ్లిన వారిని తిరిగి రప్పించకపోతే ప్రత్యక్ష పోరుకు దిగుతామని ఎస్‌పి ప్రభుత్వాన్ని సోమ్ హెచ్చరించారు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ నేత అతుల్ ప్రధాన్ కూడా సద్భావన పేరుతో చేపట్టిన ర్యాలీని అధికారులు అడ్డుకున్నారు.