జాతీయ వార్తలు

పదునెక్కిన నిఘా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెంగళూరు, జూన్ 17: ఉగ్రవాద ఎన్‌కౌంటర్ల సంఖ్య పెరగడం అంటే దేశ ఇంటెలిజన్స్ పెరిగిందని, అలాగే ఉగ్రవాద వ్యతిరేక నెట్‌వర్క్ మరింత బిగుస్తోందని దాని అర్థమని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ అన్నారు. ఎన్‌కౌంటర్లు ఎక్కువయ్యాయంటే మనం ఉగ్రవాదులను ఎక్కువ మందిని మట్టుబెడుతున్నామని, మన ఇంటెలిజన్స్ పెరిగిందని, మన ఉగ్రవాద వ్యతిరేక నెట్‌వర్క్ మరింతగా బిగుసుకుంటోందని అర్థమని పారికర్ శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ అన్నారు. ఉగ్రవాదుల మరణాలతో అమరులైన సైనికుల సంఖ్యను పోల్చి చూసినట్లయితే ఇప్పటివరకు చనిపోయిన ఉగ్రవాదుల సంఖ్య 60కి పైగా ఉంటే అమరులైన భద్రతా జవాన్లు 12 మందే ఉన్నారని ఆయన అన్నారు. భద్రతా జవాన్ల ప్రాణనష్టం మరింత తగ్గాలని ఆయన అంటూ, ఆ దిశగానే ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్లు పెరగడానికి కారణం నిఘా పెరగడమా లేక చొరబాటు యత్నాలు పెరగడమా అన్న విలేఖరుల ప్రశ్నకు సమాధానంగా పారికర్ ఈ విషయం చెప్పారు. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్( హెచ్‌ఏఎల్) డిజైన్ చేసి అభివృద్ది పరచిన భారత దేశ తొలి స్వదేశీ సాధారణ శిక్షణ విమానం హిందుస్థాన్ టర్బోట్రైనర్-40 (హెచ్‌టిటి-40) తొలి గగన విహారాన్ని తిలకించడం కోసం పారికర్ శుక్రవారం ఇక్కడికి వచ్చారు. ఉగ్రవాదుల చొరబాట్లు,ఎన్‌కౌంటర్ సంఘటనల్లో చాలావరకు శీతాకాలానికి ముందే జరుగుతాయని పారికర్ అంటూ, గతంలో వాటిని గుర్తించపోవడమో లేదా సీరియస్‌గా తీసుకోకపోవడమో జరిగేదని, అందుకే దేశం ఒక ఉగ్రవాదికి ఒక సైనికుడ్ని కోల్పోతూ వచ్చేదని, అయితే ఇప్పుడు పరిస్థితి మారిందని పారికర్ అన్నారు. ఉదాహరణకు గురువారం కాశ్మీర్‌లోని తంగ్‌ధార్‌లో జరిగిన సంఘటననే చూస్తే మన భూభాగంలోకి చొరబడడానికి యత్నించిన నలుగురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టారన్నారు. గత మూడు రోజుల్లో రెండు చొరబాటు యత్నాలను సైన్యం భగ్నం చేసిందని ఆయన అన్నారు. కాగా, చైనా సైన్యాలు భారత భూభాగంలోకి చొచ్చుకు వస్తున్న ఘటనలను ప్రస్తావిస్తూ అధీన రేఖకు సంబంధించి రెండు దేశాల మధ్య ఉన్న చారిత్రక సమస్య కారణంగానే ఇవి జరుగుతున్నాయన్నారు. అయితే గతంతో పోలిస్తే ఇటీవలి కాలంలో ఇలాంటి సంఘటనలు చాలావరకు తగ్గాయని, దీనికి ప్రధాన కారణం సమస్య తలెత్తినప్పుడు ఇరుపక్షాలు తరచూ చర్చించుకొని పరిష్కరించుకోవడమేనని పారికర్ అన్నారు.