జాతీయ వార్తలు

రక్షణ వలయంలో యోగా దినోత్సవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చండీగఢ్, జూన్ 17: ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా ఇతర ప్రముఖులు హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యోగా దినోత్సవం జరిగే ప్రధాన వేదిక పరిసరాల్లో ఐదువేల మంది పోలీసులతో పాటు పారామిలిటరీ దళాలతో భద్రతా చర్యలు చేపడుతున్నారు. పోలీసు బలగాలను పంపించాలని పంజాబ్, హర్యానా రాష్ట్రాలను కోరినట్లు కేంద్ర పాలిత ప్రాంత పోలీసు విభాగం వెల్లడించింది. భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు, తగిన సూచనలు ఇచ్చేందుకు స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్‌పిజి) బృందం త్వరలోనే చండీగఢ్ చేరుకోనుంది. కేపిటల్ కాంప్లెక్స్‌లో జరిగే ప్రధాన కార్యక్రమానికి 30వేలమంది హాజరయ్యే అవకాశముందనీ, అయితే ఇందులో పాల్గొనేందుకు లక్షా 20వేలమంది నమోదు చేసుకున్నారని చండీగఢ్ హోమ్ శాఖ కార్యదర్శి అనురాగ్ అగర్వాల్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ 20వ తేదీనే చండీగఢ్‌కు చేరుకుంటారని ఆయన తెలిపారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే ఈ యోగా దినోత్సవంలో భాగంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా యోగా రన్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. యోగా దినోత్సవంలో పాల్గొనే వారికి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (ఆర్‌ఎఫ్‌ఐడి) అందించబడుతుందని, ఇందులో ఆధార్ నెంబర్, ఫొటో తదితర వివరాలు ఉంటాయి. యోగా దినోత్సవ వేదిక వద్ద ప్రత్యేకంగా సెల్ఫీ జోన్‌ను కూడా ఏర్పాటుచేయడం విశేషం.
భారత్‌ను బలపరచండి
ఎన్‌ఎస్‌జి దేశాలకు అమెరికా పిలుపు
వాషింగ్టన్, జూన్ 17: అణు సరఫరా దేశాల కూటమి(ఎన్‌ఎస్‌జి)లో భారత్ సభ్వత్యానికి సంబంధించి అమెరికా మరో అడుగు ముందుకేసింది. ఈ సభ్యత్వం కోసం భారత్ చేసుకున్న అభ్యర్థనను బలపరచాలని ఇందులోని 45 సభ్యదేశాలకు విజ్ఞప్తి చేసింది. వచ్చేవారంలో సియోల్‌లో జరిగే ఎన్‌ఎస్‌జి ప్లీనరీ సమావేశంలో భారత్ దరఖాస్తులు చేపట్టాలని ఉద్ఘాటించింది. అయితే ఆ సమావేశంలో ఏమి జరగబోతోంది, పరిణామాలు ఎలా ఉంటాయన్న దానిపై తానెలాంటి ఊహాగానాలు చేయలేనని అమెరికా విదేశాంగ విభాగం ప్రతినిధి జాన్ కిర్బీ వెల్లడించారు. అయితే అమెరికా మాత్రం ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వాన్ని గట్టిగా బలపరుస్తోందని స్పష్టం చేశారు. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ కూడా ఇదే విషయాన్ని ఉద్ఘాటించారు. అంతేకాకుండా ఇందుకు సంబంధించి ఎన్‌ఎస్‌జి సభ్యదేశాలన్నింటికీ ఓ లేఖను కూడా రాశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి అవరోధాలు కల్పించే చర్యలు చేపట్టవద్దని ఆ లేఖలో కోరారు. ఇటీవల భారత్ ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో జరిపిన చర్చల అనంతరం జారీ చేసిన సంయుక్త ప్రకటనలోనూ ఎన్‌ఎస్‌జిలో భారత్ సభ్యత్వానికి సంబంధించి అమెరికా చాలా గట్టిగానే తన మద్దతు తెలిపింది.

హామీల అమలులో
ఘోర వైఫల్యం
తెలుగు రాష్ట్రాల సిఎంలపై
సిపిఎం ధ్వజం
ఆంధ్రభూమి ప్రతినిధి
న్యూఢిల్లీ, జూన్ 17: రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల పనితీరు సంతృప్తికరంగా లేదని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో రెండు రాష్ట్రా ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆయిన విమర్శించారు. ఇక్కడి సిపిఎం కేంద్ర కార్యాలయంలో సీతారాం ఏచూరి అధ్యక్షతన శుక్రవారం జరిగిన పార్టీ పొలిట్ బ్యూరోసమావేశానికి రాఘవులు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులకు కారణం ఎన్నికల హామీలు అమలుచేయపోవడమే కారణమని ఆయన స్పష్టం చేశారు. కాపులకు రిజర్వేషన్లు అంశం సున్నితమైందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన వారికి రిజర్వేషన్లు కల్పించాలని సిపిఎం మొదటి నుంచీ చెబుతోందని ఆయన అన్నారు. కాపుల రిజర్వేషన్లు కల్పించేందుకు నిపుణుల కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకోవల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ తన అనుయాయులకు మేలుచేకుర్చేందుకు నీటి ప్రాజెక్టు రీ డిజైనింగ్ ప్రారంభించారని దుయ్యబట్టారు. నరేంద్రమోదీ రెండేళ్ల పాలన మతోన్మాదాన్ని పెంచేలా ఉందని రాఘవులు విమర్శించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గుముఖం పడుతుంటే ఇక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు కేంద్రం పెంచుకుంటూ పోతోందని సిపిఎం నేత విమర్శించారు. నిత్యావసర ధరలను నియంత్రించడంలో మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైదని ఆయన ధ్వజమెత్తారు.