జాతీయ వార్తలు

బిజెపితోనే ప్రగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బస్తీ (ఉత్తరప్రదేశ్), జూలై 1: ఏడాదిలో వస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ మూడింట రెండొంతుల మెజారిటీతో బిజెపి విజయం సాధించడం ఖాయమని పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా జోస్యం చెప్పారు. పదిహేనేళ్లపాటు వంతులవారీ అధికారాన్ని అందుకున్న సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాది పార్టీలు భ్రష్టుపట్టుకుపోయాయని, ఆ పార్టీలకు ఇక కాలం చెల్లిందన్నారు. ‘ప్రస్తుతం అధికారంలోవున్న సమాజ్‌వాది స్థానాన్ని బిఎస్పీ ఎంతమాత్రం భర్తీ చేయలేదని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపే సత్తా ఆ పార్టీకి లేదు’ అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
‘ఎస్పీ, బిఎస్పీలకు సమర్థవంతమైన ప్రత్యామ్నాయ పార్టీ బిజెపి మాత్రమే’ అన్నారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఎన్టీయేకు అత్యధిక మెజార్జీ ఇచ్చిన క్రెడిట్ ఉత్తరప్రదేశ్‌కే దక్కుతుందంటూ, అవే ఫలితాలు రానున్న అసెంబ్లీ ఎన్నకల్లోనూ పునరావృతం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. బస్తీలోని కిసాన్ డిగ్రీ కళాశాల్లో జరిగిన పార్టీ బూత్‌స్థాయి అధ్యక్షుల సమావేశంలో అమిత్ షా మాట్లాడుతూ ‘పార్టీ శ్రేణులు కొంచెం కష్టపడితే, వచ్చే ఏడాదిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపి విజయం ఖాయం’ అన్నారు. ‘ఎస్పీ, బిఎస్పీలకు పదిహేనేళ్లు వంతులవారీ అధికార అవకాశం కల్పించారు. ఇప్పుడు బిజెపికి ఒక్క చాన్స్ ఇచ్చిచూడండి’ అంటూ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వచ్చే ఎన్నికల నాటికి బిఎస్పీలో మాయవతి ఒక్కరే మిగులుతారు’ అంటూ బిఎస్పీని వీడిపోతున్న నాయకులను ప్రస్తావిస్తూ చలోక్తి విసిరారు. ‘అధికారం ఇచ్చినందుకు అఖిలేష్ ప్రభుత్వం ఏం సాధించింది, అవినీతి, దారితప్పిన లా అండ్ ఆర్డర్ తప్ప’ అంటూ ఎస్పీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్టీయే ప్రభుత్వం చేపట్టిన ప్రజోపయోగ పథకాలు ప్రజలకు చేరకుండా ఎస్పీ ప్రభుత్వం అడ్డుపడుతోందని దుమ్మెత్తిపోశారు. ‘అఖిలేష్ ప్రభుత్వానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు భూములు పంచడం మానేసి, గూండాగిరి పంచుతోంది. పోలీసులనే రక్షించుకోలేని ప్రభుత్వం, సామాన్యులకు ఎలాంటి రక్షణ కల్పించగలదో ప్రజలే ఆలోచిచాలి’ అంటూ 29మంది మృతికి కారణమైన జవహర్ బాగ్ ఘర్షణలను ప్రస్తావించారు. గోరక్‌పూర్‌లో ఎయిమ్స్ ఏర్పాటులో జరుగుతోన్న జాప్యాన్ని ప్రస్తావిస్తూ ‘ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కంగారుపడాల్సిన పనేం లేదు. మరో ఏడాదిలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత ఎయి మ్స్ ఏర్పాటుకు ఒక మార్గం చూపిస్తుంది’ అని ఎద్దేవా చేశారు.
గతంలో అధికారం చెలాయించిన కాంగ్రెస్ పార్టీ అవినీతికి పథకాలు రచిస్తే, వాటినే అమలు చేస్తూ ఎస్పీ, బిఎస్పీలు అవినీతి కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని అమిత్ షా దుయ్యబట్టారు. అవినీతికి అడ్డాగా మారిన సవాజ్‌వాది ప్రభుత్వాన్ని గద్దె దింపకుంటే ఉత్తర్‌ప్రదేశ్ ప్రగతి ఎప్పటికీ తీరని కలగానే మిగిలిపోతుందని అమిత్ షా జోస్యం చెప్పారు.

chitram...
ఉత్తరప్రదేశ్‌లోని బస్తీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జాతీయ అధ్యక్షుడు అమిత్ షా