జాతీయ వార్తలు

ఏటిఎం దొంగల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

థానే, జూలై 1: ఏటిఎం ఆఫీసుపై దాడి చేసి 9.16 కోట్ల రూపాయలు లూటీ కేసును మహారాష్ట్ర పోలీసులు ఛేదించారు. ముఠాలో ఆరుగురని థానే పోలీసులు అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి 3.12 కోట్ల రూపాయలు రికవరీ చేశారు. ఏటిఎంలలో నగదు నింపే ఆఫీసుపై జూన్ 28 తెల్లవారుజామున దోపిడీ ముఠా దాడి చేసింది. లూటీలో 15 మంది వరకూ పాల్గొన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇందులో ఆరుగురిని అరెస్టుచేసినట్టు మహారాష్ట్ర డిజిపి ప్రవీణ్ దీక్షిత్ శుక్రవారం వెల్లడించారు. స్థానిక పోలీసులు, క్రైమ్‌బ్రాంచ్ సిబ్బంది సంయుక్తంగా ఆపరేషన్ జరిపి థానే, నాసిక్‌లలో ఆరుగురిని పట్టుకున్నట్టు ఆయ న తెలిపారు. దోపిడీలో వినియోగించిన తుపాకీ, ఒక కత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. దుండగులు ఎత్తుకెళ్లిన సిసి కెమెరాలు, డివిఆర్, మరో ఆయుధం కోసం గాలిస్తున్నట్టు డిజిపి చెప్పారు. దోపిడీ జరిగి 48 గంటల్లోనే పోలీసులు కేసును ఛేదించారని పేర్కొన్నారు. మిగతా దొంగలను పట్టుకుని తీరతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కాగా దోపిడీ విషయాన్ని సంబంధిత కంపెనీ పోలీసులకు సకాలంలో ఫిర్యాదు చేయలేదని డిజిపి వెల్లడించారు. ఎత్తుకెళ్లిన నగదు, నిందితుల అరెస్టే తమ ముందున్న తక్షణ కర్తవ్యమని ఆయన చెప్పారు. ఏటిఎం ఆఫీసు నుంచి నగదు ఎత్తుకెళ్లిన దొంగలు నాసిక్ సమీపంలోని వాడివరేలో భేటీ అయి పంచుకున్నట్టు ఆయన అన్నారు. ఇలా అరెస్టయిన వారి పేర్లు పోలీసులు వెల్లడించారు. నితీశ్ భగవాన్ అవద్ అలియాస్ గోలు(22), అమోల్ అరుణ కార్లే(26), ఆకాష్ చంద్రకాంత్ చవాన్ అలియాస్ చింగ్య, మయూర్ రాజేంద్ర కడెం అలియాస్ అజింఖ్య (21)లను థానేలో అరెస్టు చేశారు. ఉమేష్ సురేశ్ వాఘ్(28), హరిచంద్ర ఉత్తమ్ మథే(30)లను నాసిక్‌లో అదుపులోకి తీసుకున్నారు.

చిత్రం.. అరెస్టు వివరాలను వెల్లడిస్తున్న మహారాష్ట్ర డిజిపి ప్రవీణ్ దీక్షిత్