జాతీయ వార్తలు

కేజ్రీవాల్ ముఖ్యకార్యదర్శి రాజేంద్రకుమార్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ముఖ్య కార్యదర్శి రాజేంద్రకుమార్‌ను సోమవారం సీబిఐ అరెస్టు చేసింది. రూ.50 కోట్ల అవినీతి కేసులో రాజేంద్రకుమార్‌తో పాటు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు సీబీఐ ప్రతినిధి ఆర్కే గౌడ విలేఖరుల సమావేశంలో తెలిపారు. ‘అరెస్టయిన వారిపై అవినీతి, అధికార దుర్వినియోగం అభియోగాలు ఉన్నాయి. తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది’ అని గౌడ వివరించారు. రాజేంద్రకుమార్‌తో పాటు తరుణ్‌శర్మ, సందీప్ కుమార్, దినేశ్ గుప్తా, అశోక్‌కుమార్‌లు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఈ అయిదుగురిని మంగళవారం ఢిల్లీలోని పాటియాలా కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరుస్తారు. 2007లో ఎండీవర్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్‌ను తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేయటం ద్వారా ప్రోత్సహించారని, సదరు కంపెనీకి రూ.9.5 కోట్ల టెండర్లు కట్టబెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది. దీనిపై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా తీవ్రంగా స్పందించారు. ‘‘్ఢల్లీ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అరెస్టయ్యారు. ఉప కార్యదర్శి కూడా అరెస్టయ్యారు. అదనపు కార్యదర్శిని బదిలీ చేశారు. ఇదంతా ముఖ్యమంత్రి కార్యాలయాన్ని పనిచేయకుండా చేయటమే. ఇదంతా కేంద్రప్రభుత్వం కుట్రలో భాగమే’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కేంద్రం కుట్ర:
ఢిల్లీ సియం ముఖ్య కార్యదర్శిని అరెస్టు చేయటం కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని అస్థిరపరచేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రగా అధికార ఆమ్ ఆద్మీపార్టీ ఆరోపించింది. మోదీ సర్కారు కేజ్రీవాల్‌పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని పేర్కొంది. గత 23 సంవత్సరాలలో కేంద్రం లోని ఏ ప్రభుత్వమూ ఇంతగా దిగజారలేదని విమర్శించింది. కేంద్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించింది.