జాతీయ వార్తలు

ఉగ్రదాడి మృతులకు బంగ్లా కన్నీటి నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢాకా, జూలై 4: బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన భారత యువతి సహా 20 మంది బాధితులకు ఆ దేశం కన్నీటి నివాళులర్పించింది. సోమవారం నిర్వహించిన ఈ సంతాప కార్యక్రమానికి బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి షేక్ హసీనా నాయకత్వం వహించి మృతులకు ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. ఢాకా కంటోనె్మంట్‌లోని బంగ్లాదేశ్ ఆర్మీ స్టేడియంలో జరిగిన ఈ సంతాప కార్యక్రమానికి వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పలువురు దౌత్యవేత్తలు, రాజకీయ నాయకులతోపాటు సమాజంలోని వివిధ వర్గాలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై మృతులకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని హసీనా మూడు శవపేటికల (రెండు బంగ్లాదేశ్ పౌరులవి, మరొకటి బంగ్లాదేశ్ సంతతికి చెందిన అమెరికన్‌ది)పై పుష్పగుచ్ఛాలు ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. ఎత్తయిన వేదికపై అమర్చిన ఈ శపేటికలపై మృతుల జాతీయతను తెలియజేసే విధంగా భారత్, ఇటలీ, బంగ్లాదేశ్, జపాన్, అమెరికా పతాకాలను కప్పారు. ఉగ్రవాదులు శుక్రవారం ఢాకాలో విదేశీయులు అధికంగా వచ్చే ఒక కేఫ్‌ను ముట్టడించి 20 మందిని దారుణంగా హత్య చేసిన విషయం విదితమే. ఈ దాడిలో మృతిచెందిన 18 మంది విదేశీయుల్లో భారత్‌కు చెందిన తారిషి జైన్ (19) అనే యువతితో పాటు తొమ్మిది మంది ఇటాలియన్లు, ఏడుగురు జపనీయులు, బంగ్లాదేశ్ సంతతికి చెందిన ఒక అమెరికన్ ఉన్నారు.
20 నిమిషాల్లోనే బందీలు హతం
హోలీ ఆర్టిజాన్ బేకరీలో జరిగిన ఉగ్రదాడిలో 20 మంది బందీలను పట్టుకున్న 20 నిమిషాల్లో అంతం చేశారని పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. ఈ సంఘటనలో పోలీసులు వెంటనే స్పందించలేదని కొన్ని పత్రికల్లో వచ్చిన వార్తలను ఆయన ఖండించారు.
‘బందీలను విడిపించడంలో మేము తాత్సారం చేశామని కొన్ని పత్రికలు వ్యాఖ్యానించాయి. వాటిలో నిజం ఎంతమాత్రం లేదు. మా ఆపరేషన్ కేవలం 12 గంటల్లో ముగిసింది. అయితే ఉగ్రవాదులు బందీలను పట్టుకున్న 20 నిమిషాల్లో హతమార్చారు’ అని ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎకెఎం షాహిదుల్ హక్ పేర్కొన్నారు. అదే కెన్యాలాంటి దేశంలో అయితే ఇలాంటి ఆపరేషన్‌కు నాలుగు రోజులు పట్టేదని అన్నారు.

ఉగ్రవాద దాడిలో మృతిచెందిన వారికి నివాళులర్పిస్తున్న బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా