జాతీయ వార్తలు

స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రచారకర్తగా అమితాబ్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 4: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘స్వచ్ఛ భారత్ అభియాన్’కు ప్రచారకర్తగా బిగ్‌బి అమితాబ్ బచ్చన్ నియమితులుకానున్నారు. ఈ మేరకు అభిప్రాయం కోరుతూ అమితాబ్‌కు లేఖ రాసినట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అభియాన్‌లోని ఓ ఎపిసోడ్‌కు బచ్చన్ సేవలు వినియోగించుకోవాలని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వశాఖ భావిస్తోంది. వ్యర్థాలు ఎక్కడిబడితే అక్కడ పడేయకుండా కంపోస్టు ఎరువుగా వాడుకోవడం, ఖాళీ స్థలాలను చెత్తతో నింపేయకుండా ఉండేందుకు ఓ ప్రచార కార్యక్రమాన్ని రూపొందించనున్నారు. టివిలు, రేడియో, ప్రకటనలు, పాటల రూపంలో ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్టు మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాలన్నింటికీ బాలీవుడ్ స్టార్ అమితాబ్‌ను ప్రచారకర్తగా వినయోగించుకోవాలని నిర్ణయించామన్నారు. ఈ మేరకు గత నెల 20న బచ్చన్‌కు లేఖ రాశామన్న డైరెక్టర్ ఆయన అభిప్రాయంకోసం ఎదురుచూస్తున్నట్టు వెల్లడించారు. పట్టణాల్లో ఘనవ్యర్థాలను వందశాతం శాస్ర్తియ పద్ధతిలో సద్వినియోగం చేసుకోవాలన్నది స్వచ్ఛ్భారత్ మిషన్ లక్ష్యం. వ్యర్థ్యాలను సేంద్రీయ ఎరువుల కింద వాడుకుంటారు. దీనిపై రైతులు, ప్రజలు, నర్సరీలు, జనవాసాల వద్ద పెద్దఎత్తున ప్రచారం చేయాలని నిర్ణయించినట్టు మిషన్ డైరెక్టర్ ప్రవీణ్ ప్రకాశ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ 2014 అక్టోబర్ 2న స్వచ్ఛ్భారత్ అభియాన్‌ను ప్రారంభించి ఐదేళ్లలో ఈ కార్యక్రమాన్ని అమలుచేయాలని నిర్ణయించారు.