జాతీయ వార్తలు

సమర్థంగా పనిచేస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 6: కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖమంత్రిగా రెండేళ్లు పనిచేయడం సంతృప్తినిచ్చిందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వెల్లడించారు. బుధవారం శాస్ర్తీభవన్‌లో కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వెంకయ్యనాయుడు విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ తనమీద నమ్మకంతో మరో బాధ్యతను అప్పగించారని అన్నారు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ వల్ల అభివృద్ధి వేగవంతమవుతుందని వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. పార్లమెంటు వ్యవహారాల శాఖమంత్రిగా పనిచేసిన రెండేళ్ల కాలంలో చాలా బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి, సుపరిపాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలనేదే ప్రధాని మోదీ ప్రధాన లక్ష్యమని, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని తనకు ఈ శాఖను కేటాయించారన్నారు. కొత్తగా కేటాయించిన శాఖను కూడా సమర్థంగా నిర్వహిస్తానని వెంకయ్య స్పష్టం చేశారు. కేంద్ర ప్రసార సమాచార శాఖ మంత్రిత్వశాఖ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, రాజ్యవర్థన్ రాథోడ్, అర్జున్ రాం మేఘ్‌వాల్ వెంకయ్యకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం వెంకయ్యనాయుడు వద్ద పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన, గృహనిర్మాణం, సమాచార ప్రసార శాఖలు ఉన్నాయి.