జాతీయ వార్తలు

జీఎస్టీ ఆమోదం రాష్ట్రాలకే మంచిది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: వస్తుసేవల పన్ను బిల్లు రాజ్యసభలో ఎంత తొందరగా ఆమోదం పొందితే రాష్ట్రాలకు అంత మంచిదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. జీయస్టీ బిల్లును ఆమోదించాలని రాజ్యసభలో మంగళవారం ఆయన అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. ‘‘14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు సర్వీసు టాక్స్‌లో రాష్ట్రాలకు వాటా ఇచ్చే అవకాశం లేదు. జీయస్టీ బిల్లును ఆమోదిస్తే సర్వీస్ టాక్స్‌లో కూడా రాష్ట్రాలకు వాటా ఇవ్వటానికి వీలవుతుంది’’ అని జైట్లీ ఆన్నారు. రాష్ట్రాల వాటాను 42 శాతం నుంచి 50 శాతానికి పెంచే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు జైట్లీ జవాబిస్తూ 2020 వరకూ 42 శాతమే కొనసాగుతుందన్నారు. నిరుడు 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రాలు 1,88,000 కోట్లను పొందుతాయని ఆయన స్పష్టం చేశారు. ఆయా రాష్ట్రాల భౌగోళిక, ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని పధ్నాలుగో ఆర్థిక సంఘం సిఫార్సులు చేసిందని జైట్లీ వివరించారు. కొన్ని పథకాల విషయంలో కొన్ని రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొన్నాయని, వీటి పరిష్కారానికి ముఖ్యమంత్రులతో కమిటీని ఏర్పాటు చేసి దాని సిఫార్సుల మేరకు కొన్ని పథకాలకు నూటికి నూరు శాతం కేంద్రమే నిధులను అందించేందుకు సిద్ధపడిందని జైట్లీ తెలిపారు. ‘‘అయితే ప్రతి రాష్టమ్రూ ఈ పథకాల అమలుకోసం అదనంగా నిధులు సమీకరించుకోవలసి ఉంటుంది’’ అని ఆయన స్పష్టం చేశారు.