జాతీయ వార్తలు

భారత్‌లో 57 శాతం వైద్యులు అనర్హులే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 19: భారత్‌లో వైద్యుల గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ మంగళవారం సంచలన ప్రకటన చేసింది. భారత్‌లో వైద్యులుగా చెలామణి అవుతున్న అల్లోపతి వైద్యుల్లో 57శాతం మందికి ఎలాంటి వైద్యపరమైన అర్హతలు లేవని స్పష్టం చేసింది. ‘‘హెల్త్ వర్క్ఫోర్స్ ఇన్ ఇండియా’’ పేరుతో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన ఒక నివేదికలో వైద్యులుగా చెలామణి అవుతున్న వారిలో 31శాతం మంది సెకండరీ విద్యను అభ్యసించిన వారేనని స్పష్టం చేసింది. 2001జనాభా లెక్కల ప్రకారం దేశంలోని అన్ని జిల్లాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ నిర్ధారణకు వచ్చినట్లు పేర్కొంది. ఆయుర్వేద వైద్యుల్లో 60శాతం, యునానీ విధానంలో 46శాతం, హోమియోపతిలో 42శాతం మంది ఎలాంటి మెడికల్ డిగ్రీలు లేనివారేనని పేర్కొంది. అంతేకాదు, దేశంలో 42.3శాతం డెంటిస్టులకే మెడికల్ డిగ్రీలు ఉన్నాయని ఈ నివేదిక వెల్లడించింది. దేశంలోని మొత్తం వైద్యుల్లో మహిళలే ఎక్కువగా రాణిస్తున్నారని కూడా పేర్కొంది. దీంతో పాటు భారత్‌కు ప్రపంచ ఆరోగ్యసంస్థ తీవ్రస్థాయిలో హెచ్చరిక కూడా చేసింది. ఒకప్పుడు లక్ష జనాభాకు 80మంది డాక్టర్లు ఉన్న నిష్పత్తి ఇప్పుడు గణనీయంగా తగ్గిందని, ఇప్పుడు లక్షమందికి కేవలం 36మంది డాక్టర్లే ఉన్నారని హెచ్చరించింది.