జాతీయ వార్తలు

రేపంతా రాజ్యసభలో ఉండాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,జూలై 20: ఏ.పికి ప్రత్యేక హోదా కోసం కెవిపి రామచంద్రరావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు రాజ్యసభ ఆమోద ముద్ర వేయించుకోవాలనే పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ బుధవారం పార్టీ ఎంపిలకు మూడు లైన్ల విప్ జారీ చేసింది. కాంగ్రెస్ సభ్యులందరూ శుక్రవారం రోజంతా రాజ్యసభ కార్యక్రమాలకు హాజరై అధినాయకత్వం నిర్ణయం మేరకు నడుచుకోవాలంటూ కాంగ్రెస్ విప్ జారీ చేసింది. ఏపికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ రామచందర్‌రావు ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లు ఎల్లుండి రాజ్యసభలో ఓటింగ్‌కు వస్తే కాంగ్రెస్ సభ్యులంతా బిల్లుకు అనుకూలంగా ఓటు వేసేందుకు వీలుగా ఈ విప్ జారీ అయ్యింది. ఇది అత్యంత ముఖ్యమైన అంశం కాబట్టి కాంగ్రెస్ ఎంపిలందరు శుక్రవారం నాడు రాజ్యసభలో ఉండాలని విప్‌లో స్పష్టం చేశారు. కాంగ్రెస్ చీప్‌విప్ సత్యవ్రత చతుర్వేది ఈ విప్ జారీ చేశారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటంపై బిజెపి చిత్తశుద్ధి ఏమిటో దీంతో బైట పడుతుందని కాంగ్రెస్ సీనియర్ నాయకుడొకరు తెలిపారు. కాంగ్రెస్‌తోపాటు తెలుగుదేశం మనసులోని మాట కూడా బైటికి వస్తుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
బిల్లుకు తెదేపా మద్దతు
కాగా కేవీపీ ప్రతిపాదించిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్రమంత్రి సుజనాచౌదరి నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం కేవీపీ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఏపి ప్రయోజనాల సాధన, పరిరక్షణ కోసం జరిగే ప్రతి ప్రయత్నాన్ని సమర్థించాలని మెజారిటీ ఎంపిలు అభిప్రాయపడ్డారు. ఏపికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఏ పార్టీ వారు ప్రయత్నించినా తమ మద్దతు ఉంటుందని టిడిపి ఎంపిలు చెబుతున్నారు. ఏపి ప్రయోజనాల పరిరక్షణలో రాజకీయాలకు తావు ఉండదు, రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వటం జరగదని టిడిపి ఎంపిలు చెబుతున్నారు.
మద్దతు ఇవ్వండి : జైట్లీకి కెవిపి లేఖ
ఏపికి ప్రత్యేక హోదా కోరుతూ తాను ప్రతిపాదించిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ ఎంపి కెవిపి రామచంద్రరావుకేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీకి బుధవారం ఒక లేఖ రాశారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వటంతోపాటు విభజన చట్టంలో ఇచ్చిన హామీలు పూర్తిచేసేందుకు వీలుగా ప్రైవేటు బిల్లును ప్రతిపాదించినట్టు తెలిపారు. బిల్లుపై ఈనెల 22న రాజ్యసభలో ఓటింగ్ జరుగుతోందన్నారు. రాష్ట్రానికి ఎంతో మేలుచేసే ప్రత్యేక హోదాకు సంబంధించిన బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. తాను ప్రతిపాదించిన అన్ని సవరణలూ 2014 ఫిబ్రవరి 20 తేదీనాడు రాజ్యసభలో బిజెపి సీనియర్ నేత ఎం వెంకయ్యనాయుడు రాష్ట్ర విభజన బిల్లును రాజ్యసభ ఆమోదించినప్పుడు ప్రతిపాదించినవేనని స్పష్టం చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన అన్ని పార్టీల ఎంపీలు వ్యతిరేకించినా బిజెపి మద్దతుతో రాష్ట్ర విభజన బిల్లు లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించారని ఆయన గుర్తుచేశారు. రాష్ట్ర విభజన జరిగి రెండేళ్లు కావస్తున్నా విభజన చట్టంలో చేసిన హామీలేవీ అమలు కాలేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించేందుకు బిజెపి మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.

మద్దతిస్తానని అనలేదు: కేటీఆర్
ఆంధ్రరాష్ట్ర ప్రత్యేక హోదాకు సంబంధించిన ప్రయివేట్ మెంబర్ బిల్లుకు తెరాస మద్దతిస్తుందని తాను అనలేదని తెలంగాణ మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. హైకోర్టు విభజనపై ఎవరైనా బిల్లుపెడితే మద్దతిస్తామని మాత్రమే చెప్పామన్నారు. ప్రైవేటు మెంబర్ బిల్లులతో ఒరిగేదేమీ లేదని, కాంగ్రెస్ నేతలకు చిత్తశుద్ధి, ఇంగితజ్ఞానం ఉంటే అన్ని పార్టీలతో ఇప్పటికే సంప్రదించి ఉండాల్సిందన్నారు.