జాతీయ వార్తలు

కాశ్మీర్ మీ సొంత వ్యవహారం కాదు ప్లెబిసైట్ నిర్వహించాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాహోర్/ఇస్లామాబాద్, జూలై 20: కాశ్మీర్ అంశం భారత దేశ ఆంతరంగిక వ్యవహారం ఎంత మాత్రం కాదని పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్పష్టం చేశారు. దీనిపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాల్సిందేనని డిమాండ్ చేశారు. కాగా, కాశ్మీర్ ప్రజలకు సంఘీభావంగా బుధవారం ప్రభుత్వం నిర్వహించిన ‘బ్లాక్ డే’కు ప్రజల నుంచి అంతంత మాత్రంగానే ప్రతిస్పందన వచ్చింది. తమ హక్కుల కోసం పోరాడుతున్న కాశ్మీర్ ప్రజలకు సంఘీభావంగానే బ్లాడ్ డేను నిర్వహిస్తున్నామని, ఆ విధంగా ప్రపంచ దేశాలకూ బలమైన సంకేతాన్ని పంపుతున్నామని ఓ సందేశంలో నవాజ్ షరీఫ్ పేర్కొన్నారు. కాశ్మీర్‌ను వివాదాస్పద ప్రాంతంగా ఐరాస గుర్తించిందని, ఆ రాష్ట్ర ప్రజల హక్కులను గౌరవిస్తూ భారత ప్రభుత్వం ప్లెబిసైట్ నిర్వహించాల్సిందేనని నవాజ్ ఉద్ఘాటించారు. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ను తమ ఆంతరంగిక వ్యవహారంగా భారత్ ప్రకటించడం ఎంత మాత్రం సహేతుకం కాదని అన్నారు. ఆ రాష్ట్రంలో జరుగుతున్న మానవ హక్కుల అణచివేత ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతోందన్నారు.

పట్టిసీమపై జగన్ వైఖరి చెప్పాలి: దేవినేని

న్యూఢిల్లీ, జూలై 20: పట్టిసీమ ఎత్తిపోతల పథకంపై ప్రతిపక్ష నాయకుడు జగన్ వైఖరి స్పష్టం చేయలని భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమహేశ్వరరావుడిమాండ్ చేశారు. బుధవారం ఢిల్లీలో విలేఖరులతో మాట్లాడుతూ నీటి ప్రాజెక్టులను అడ్డుకొనేందుకు జగన్ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పులివెందుల నీటిని తరలించే కాలువ నిర్మాణానికి స్టే తీసుకొచ్చిన ఎమ్మెల్యే బుగ్గిన రాజేంద్రనాథ్ రెడ్డికి పిఏసీ చైర్మన్ పదవి ఇచ్చారని విమర్శించారు. కృష్ణా ట్రిబ్యునల్‌లో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి హయాంలో వాదనలు సమర్థంవంతగా వినిపించలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అందువల్లనే తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందనని చెప్పారు.
గుంటూరు ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు
గుంటూరు జిల్లా యువకులను చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటనపై జాతీయ మనవ హక్కుల కమిషన్ ఎపి ప్రభుత్వనికి నోటీసులు జారీ చేసింది.షేక్ జాస్మిన్ అనే యువతి అత్మహత్య చేసుకోగా, అనుమానాస్పద నిందితులుగా ఉన్న ఇద్దరు యువకులను గ్రామస్థులు కొట్టడంతో ఒకరు మరణించారు. మీడియాలో వచ్చిన కథనాలు ఆధారంగా సుమోటోగా తీసుకున్న ఎన్‌హెచ్‌ఆర్‌సి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చింది.

మున్సిపాలిటీలకు
కేంద్ర నిధుల విడుదల

న్యూఢిల్లీ, జూలై 20: రాష్ట్రంలోని కొన్ని మున్సిపాలిటీలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించనందుకు గతంలో విడుదల చేయని 33.28 కోట్ల రూపాయలను ఈ ఏడాది తెలంగాణకు విడుదల చేస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ది, సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధుల విడుదల అంశాన్ని ఈరోజు పట్టణాభివృద్ది శాఖలో జరిగిన ఒక సమావేశంలో సమీక్షించిన అనంతరం తెలంగాణకు నిధులు విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు వెంకయ్య వివరించారు. తెలంగాణ మున్సిపల్ పరిపాలన శాఖ అదనపు డైరెక్టర్ అనూరాధ ఈరోజు జరిగిన సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి వివరించారని మంత్రి తెలిపారు. ఆర్థిక సంఘం నిధుల నుండి దాదాపు 70 శాతం నిధులను తాగునీటి సరఫరా, రోడ్ల నిర్మాణం, మురుగు కాలువల నిర్మాణం, వీధి దీపాల ఏర్పాటు తదితర పనులకు వినియోగిస్తున్నట్లు అనురాధ వివరించారు.