జాతీయ వార్తలు

రైతుల ఆత్మహత్యలకు దెయ్యాలే కారణం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భోపాల్, జూలై 20: రైతుల ఆత్మహత్యలకు కారణాలు విశే్లషించి వాటిని నిరోధించే చర్యలు తీసుకోవల్సిన ప్రభుత్వమే విడ్డూరమైన ప్రకటన చేయడం దిగ్భ్రాంతి కలిగించేదే. గత మూడేళ్లుగా మధ్యప్రదేశ్‌లో 418 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే ఇందుకు కారణం వారందరికీ దెయ్యాలు పూనడమేనని మధ్యప్రదేశ్ ప్రభుత్వమే అసెంబ్లీ సాక్షిగా ప్రకటించింది. అయితే ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులు ఇచ్చిన సమాచారానే్న తాము వెల్లడిస్తున్నామని స్పష్టం చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బుధవారం హోమ్ మంత్రి భూపేందర్‌సింగ్ ఓ లిఖితపూర్వక సమాధానంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ రైతూ కూడా ఆర్థిక ఇబ్బందులు కారణంగా ఆత్మహత్య చేసుకోలేదన్నది వాస్తవమని అన్నారు. దెయ్యాలు పూనడం వల్లే రైతులు మరణించారంటూ మంత్రే చెప్పడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం దెయ్యాలను నమ్ముతుందా అన్న ప్రశ్నించినప్పుడు సభ్యులు ఒక్కసారిగా గొల్లుమన్నారు.

ఉత్తరాఖండ్ అనర్హత ఎమ్మెల్యేలకు
సుప్రీంకోర్టులో చుక్కెదురు

న్యూఢిల్లీ, జూలై 20: ఉత్తరాఖండ్‌లో అనర్హతకు గురైన తొమ్మిది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఈ నెల 21నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వీలుగా అనర్హత నుంచి సడలింపు నివ్వాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. న్యాయమూర్తులు జస్టిస్ దీపక్ మిశ్రా, ఆర్.ఎఫ్.నారిమన్‌తో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్యేలు, బిజెపి సభ్యులు దాఖలు చేసిన పిటిషన్‌ను తుది తీర్పు వచ్చేవరకూ పరిశీలనలో ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. రెబెల్ ఎమ్మెల్యేలతో పాటు కున్వర్ ప్రణవ్ సింగ్ చాంపియన్ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈ నెల 28నే విచారణ జరపాలని ధర్మాసనం నిర్ణయించింది.