జాతీయ వార్తలు

ఆరోగ్య సేవలు, రిటైర్మెంట్ అధ్వాన్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 20: రిటైరైన వాళ్లకు, ఆరోగ్య సేవలకు సంబంధించీ భారత్ దేశం అత్యంత అధ్వాన్న స్థితిలో ఉంది. మొత్తం 43దేశాల్లోని పరిస్థితులపై జరిగిన అంతర్జాతీయ సర్వేలో భారత్‌కు చిట్టచివరి స్థానం దక్కింది! మొదటి మూడు స్థానాల్లో నార్వే, స్విట్జర్లాండ్, ఐస్‌లాండ్‌లు ఉన్నాయి. మిగతా ఏడు స్థానాలు వరుసగా న్యూజిలాండ్, స్వీడన్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్స్, ఆస్ట్రియా, కెనడాలు ఉన్నాయి. ఆరోగ్య సేవల వ్యవస్థ కూడా భారత్‌లో ఎంత మాత్రం సంతృప్తికరంగా లేదని, దీనికి కేవలం 4శాతం స్కోరు మాత్రమే లభించిందని జిఆర్‌ఐ జరిపిన ఈ సర్వేలో వెల్లడైంది. తలసరి వైద్య ఖర్చు, బీమాయేతర వైద్య ఖర్చు, ఆయుష్షు ప్రమాణం కూడా భారత్‌లో కనిష్ఠ స్థాయిలో ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో ఉన్న వారికి వైద్యపరమైన సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ అత్యధిక స్థాయిలో ప్రజలు ఉంటున్న గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కనీస వైద్య సౌకర్యాలు కూడా లేవని జిఆర్‌ఐ తెలిపింది.