జాతీయ వార్తలు

‘అయోధ్య’ యోధుడు హషీ అన్సారీ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య, జూలై 20: రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంలో అతిపెద్ద కక్షిదారు అయిన హషీం అన్సారీ బుధవారం ఇక్కడ మృతి చెందారు. 1949 నుంచి ఈ వివాదంతో సంబంధం ఉన్న 95 ఏళ్ల అన్సారీ గుండె సంబంధ వ్యాధితో మృతి చెందారు. అన్సారీ తన స్వగృహంలో తెల్లవారు జామున తుది శ్వాస విడిచినట్లు అతని కుమారుడు ఇక్బాల్ చెప్పారు. అయోధ్యలో జన్మించిన అన్సారీ ఈ వివాదంపై తొలిసారి 1949లో ఫైజాబాద్‌లోని సివిల్ జడ్జి కోర్టులో కేసు వేశారు. సున్ని సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఫైజాబాద్ సివిల్ జడ్జి కోర్టులో వేసిన ‘అయోధ్య టైటిల్ సూట్’ కేసులో మరో ఆరుగురితో అన్సారీ ప్రధాన కక్షిదారుగా ఉన్నారు. 2010లో అలహాబాద్ హైకోర్టు ధర్మాసనం మెజారిటీ తీర్పు వెలువరించిన తరువాత ఈ వివాదానికి కోర్టు వెలుపల శాంతియుతంగా పరిష్కారం కనుగొనడానికి అన్సారీ కృషి చేశారు.
అన్సారీ మృతి పట్ల విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) స్పందిస్తూ, అతివాదులు అన్సారీ జీవితం నుంచి ఎంతో నేర్చుకోవాలని వ్యాఖ్యానించింది. ‘హషీం నీటిలో బుడగలాంటి వ్యక్తి. ఇతర కక్షిదారులు, అతివాదులతో పోలిస్తే భిన్నంగా ఆలోచించిన వ్యక్తి. ఇది సంతాపం తెలపాల్సిన, విచారం వ్యక్తం చేయాల్సిన సమయం’ అని విహెచ్‌పి అధికార ప్రతినిధి శరద్ శర్మ అన్నారు. అన్సారీ మృతి పట్ల బాబ్రీ మసీదు యాక్షన్ కమిటీ కన్వీనర్ జఫర్యాబ్ జిలానీ విచారం వ్యక్తం చేశారు. కల్కిపీఠం అధిపతి ప్రమోద్ కృష్ణన్.. అన్సారీని నిజమైన దేశభక్తుడిగా వర్ణించారు. దేశ ‘గంగా-జమునా తెహ్‌జీబ్’ను బలోపేతం చేయడానికి అన్సారీ ఎల్లవేళలా కృషి చేశారని ఆయన కొనియాడారు. కొంతమంది ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్న సమయంలో అన్సారీ మృతి దేశానికి పెద్ద లోటని ప్రమోద్ కృష్ణన్ అన్నారు.