జాతీయ వార్తలు

జాడలేని ఎఎన్-32

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 24: చెన్నైనుంచి పోర్ట్‌బ్లెయిర్ 29 మందితో వెళ్తూ జాడతెలియకుండాపోయిన వాయుసేనకు చెందిన ఎఎన్32 విమానంకోసం నిర్విరామంగా సాగిస్తున్న గాలింపు మూడోరోజుకు చేరుకున్నప్పటికీ విమానం జాడ ఏమాత్రం తెలియకపోవడంతో గాలింపు బృందాలు ఇప్పుడు ఉపగ్రహ చిత్రాల సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. జలాంతర్గాములతోసహా నౌకాదళానికి చెందిన 18 నౌకలు, పి81, సి130, డార్నియర్ లాంటి ఎనిమిది విమానాలు బంగాళాఖాతంలో నిరంతరాయంగా సాగుతున్న గాలింపు చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం నుంచి మాయమైన విషయం తెలిసిందే. అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ఉపయోగించుకుంటున్నామని, ఉపగ్రహ సమాచారాన్ని కూడా కోరామని తూర్పు నౌకాదళం ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ హెచ్‌సిఎస్ బిష్త్ విశాఖపట్నంలో చెప్పారు. వాతావరణం అనుకూలంగా లేదని, వర్షం కూడా కురుస్తోందని ఆయన చెప్పారు. ఇలావుండగా, ఎఎన్32 విమానం ఆచూకీలో ఎలాంటి పురోగతి లేదని వైమానికదళ పిఆర్‌వో అనుపమ్ బెనర్జీ ఆదివారం ఢిల్లీలో విలేఖరులకు తెలిపారు.
పోలీసులకు ఫిర్యాదు
ఎఎన్32 విమానం గల్లంతుపై వాయుసేన అధికారులు తమిళనాడు పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశారు. వైమానిక దళానికి చెందిన ఎఎన్ 32 విమానం కనిపించకుండా పోవడంపై తమకు ఒక ఫిర్యాదు అందినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు ఆదివారం చెప్పారు. సెలైయూర్ పోలీసు స్టేషన్‌లో శనివారం రాత్రి ఈ ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. విమానంలో 29 మంది ఉన్నారని, విమానం కనిపించకుండా పోయిందని, విమానంలో ఉన్న వారిలో తమిళనాడుకు చెందిన ఒకరున్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని ఆ అధికారి చెప్పారు. న్యాయపరమైన అవసరాలకోసం ఈ ఫిర్యాదు చేశారు.
అద్భుతం జరుగుతుందేమో..
భివానీ: జాడతెలియకుండా పోయిన విమానం ఎఎన్-32లో ఫ్లైట్ లెఫ్టెనెంట్‌గా ఉన్న దీపికా షేవోరన్ కుటుంబ సభ్యులు ఇప్పుడు ఏదయినా అద్భుతం జరిగి తమ బిడ్డ ప్రాణాలతో తిరిగి రావాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నారు. ప్రమాదం జరగడానికి ఒక రోజు ముందు దీపికతో మాట్లాడినట్లు ఆమె తల్లి ప్రేమలత తెలిపింది.