జాతీయ వార్తలు

ప్రత్యేక హోదాకోసం ఆందోళన చేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఇచ్చిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం సిపిఎం పోరాటం చేస్తుందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ, బిజెపి ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండు సంవత్సరాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నా కేంద్రం హామీలను అమలు పరచడం లేదని మండ్డిపడ్డారు. ఏపి విభజనను తొందరపడి ఆలోచించకుండా చేస్తున్నారని ఆ సమయంలోనే కాంగ్రెస్, బిజెపిలకు స్పష్టం చేశామన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం సరైన రీతిలో విభజన చేయకపోవడం వల్లనే సమస్యలు ఉత్పన్నమవువుతున్నాయని చెప్పారు. బిజెపి ప్రతీపక్షంలో ఉన్నపుడు తాము అధికారంలోకి వస్తే ఏపికి పది సంవత్సరాలు ప్రత్యేకహోదా ఇస్తామని ఎవరూ అడగకుండానే వెంకయ్యనాయుడు హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. కేంద్రంలో బిజెపితో కలవడం మూలంగా ప్రత్యేక హోదా వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అనుకొన్నారని వ్యాఖ్యానించారు. మూడు రోజులుగా జరిగిన సిపిఎం పొలిట్ బ్యూరో సమావేశాలలో ముఖ్యంగా దేశంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో, పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, పార్టీ నిర్మాణం అంశాలపై చర్చించామన్నారు.