జాతీయ వార్తలు

తల్లీకూతుళ్ల గ్యాంగ్‌రేప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బులంద్‌షహర్, జూలై 31: ఉత్తరప్రదేశ్‌లో ఒక బందిపోటు దొంగల ముఠా జాతీయ రహదారిపై కాపుకాసి ఒక కారును అడ్డగించి అందులో ప్రయాణిస్తున్న ఒక 35 ఏళ్ల మహిళను, 13ఏళ్ల వయసు గల ఆమె కుమార్తెను కారులోంచి లాగి సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. ఉత్తరప్రదేశ్‌లో దిగజారిన శాంతిభద్రతలపై అన్ని వర్గాల నుంచి ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో రంగంలోకి దిగిన ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 24 గంటల్లోగా నిందితులను పట్టుకోవాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించడంతో అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున గాలింపులు జరిపిన పోలీసు బృందాలు 15మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నాయి. ఒక కుటుంబం శుక్రవారం రాత్రి నోయిడా నుంచి ఢిల్లీ-కాన్పూర్ జాతీయ రహదారి-91 మీదుగా షాజహాన్‌పూర్‌కు కారులో వెళ్తుండగా, బులంద్‌షహర్ బైపాస్ సమీపంలో బందిపోటు దొంగల ముఠా వారి కారును అడ్డగించి, అందులోని పురుషులను తాళ్లతో కట్టివేసి, ఒక మహిళ, ఆమె కుమార్తెను కొంతదూరం తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారి వద్ద ఉన్న నగదును, నగలను, మొబైల్ ఫోన్లను దోచుకున్నారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో అఖిలేష్ యాదవ్ 24 గంటల్లోగా కేసును ఛేదించాలని, నిందితులను పట్టుకోవాలని, నేరం జరిగిన ప్రాంతానికి చెందిన పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని బులంద్‌షహర్ సీనియర్ ఎస్‌పిని ఆదేశించారు. దీంతో 15 ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా గాలింపులు జరిపినట్లు బులంద్‌షహర్ ఎస్‌ఎస్‌పి వైభవ్ కృష్ణ చెప్పారు. 15మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని, ప్రధాన నిందితుడిని గుర్తించామని ఆయన తెలిపారు. సంచార గిరిజన తెగకు చెందిన ఈ ప్రధాన నిందితుడు గతంలోనూ అనేక నేరాలకు పాల్పడినట్లు ఆయన వివరించారు. బాధిత కుటుంబంలోని ఒక పురుషుడు ఈ సంఘటనను పోలీసులకు తెలియజేసినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్టేషన్ హౌస్ ఆఫీసర్ రాంసేన్‌ను సస్పెండ్ చేసినట్లు ఎస్‌ఎస్‌పి తెలిపారు.
పోలీసు కస్టడీలో ఉన్న అనుమానితుల్లో ముగ్గురిని బాధితురాలు గుర్తించినట్లు యుపి డిజిపి తెలిపారు. కేసు విచారణను త్వరగా పూర్తి చేయడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన తెలిపారు. సంఘటన గురించి శనివారం ఉదయం 5.30 గంటలకు ఫోన్ రాగా, వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని బాధితులను ఆసుపత్రికి తరలించినట్లు ఆయన వివరించారు. జాతీయ మహిళా కమిషన్‌కు చెందిన ముగ్గురు సభ్యుల బృందం ఆదివారం సంఘటన స్థలాన్ని సందర్శించింది.
ఇది జంగిల్‌రాజ్ పాలన: ప్రతిపక్షాలు
తల్లీకూతుళ్లపై బందిపోట్లు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడిన ఘటనపై బిఎస్‌పి, బిజెపి, కాంగ్రెస్ పార్టీలు మండిపడ్డాయి. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ హయాంలో ఉత్తరప్రదేశ్‌లో జంగిల్‌రాజ్ పాలన కొనసాగుతోందని ఆరోపించాయి. మహిళలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లలేని గూండారాజ్యం సాగుతోందని విమర్శించాయి.