జాతీయ వార్తలు

ముందుకా.. వెనక్కా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2:గత కొన్ని నెలలుగా అధికార, విపక్షాల మధ్య తీవ్ర వివాదానికి కారణమవుతున్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)బిల్లు బుధవారం పార్లమెంట్‌లో చర్చకు రానుంది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ బిల్లుకు పెద్దల సభ ఆమోద ముద్ర వేయించుకోవాలన్న పట్టుదలతో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం అన్ని పక్షాల మద్దతు లభించగలదన్న ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదింప జేసుగోలమన్న నమ్మకం తమకు ఉందని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్ కుమార్ తెలిపారు. జిఎస్‌టి ప్రాధాన్యత, అవసరంపై ఆన్ని పార్టీల్లోనూ ఏకాభిప్రాయం ఉందని పేర్కొన్న ఆయన ఎన్ని పార్టీల అధికారికంగా మద్దతు ప్రకటించాయన్న దానిపై ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ‘ఈ బిల్లు ఆమోదం పొందడం అన్నది అందరి విజయం. ఇప్పటికే దీనిపై విస్తృతంగా చర్చ జరిగింది. అంతిమ ఫలితం కూడా సానుకూలంగానే ఉంటుందని భావిస్తున్నాం’అని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిఎస్‌టి బిల్లుపై బుధవారం ఐదు గంటల పాటు చర్చ జరుగుతుంది. అదే రోజు సభ ఆమోదం పొందాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉంది. రాజ్యాంగ సవరణ బిల్లులను చేపట్టేటప్పుడు అన్ని పార్టీలు తమతమ సభ్యులకు సమన్లు పంపుతాయని, అదే రోజూ ఓటింగ్ జరుగుతుంది కాబట్టి కొన్ని పార్టీల సభ్యులు స్ట్రెచర్లపైన సభకు వచ్చిన సందర్భాలెన్నో ఉన్నాయని మరో మంత్రి గుర్తు చేశారు. ఈ బిల్లుకు సంబంధించిన అంశాల గురించి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్టీ సభ్యులందరికీ ఉదయం జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో వివరించారు. దీన్ని సభ చర్చకు చేపట్టడానికి ముందే చదివి అందులోని అంశాల్ని అర్థం చేసుకోవాలని సభ్యుల్ని కోరారు. ఇప్పటికే కాంగ్రెస్, బిజెపిలు తమతమ సభ్యులకు విప్ జారీ చేశాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ గైర్హాజరు కావడానికి వీల్లేదని విస్పష్టంగా తెలిపాయి. జిఎస్‌టి బిల్లు ద్వారా రాజ్యాంగానికి జరుగుతున్నది 122వ సవరణ. జిఎస్‌టి అమలులోకి వస్తే దేశ వ్యాప్తంగా అన్ని రకాల కేంద్ర పరోక్ష పన్నులూ ఇందులో కలిసిపోతాయి. అలాగే రాష్ట్రాలు విధించే వ్యాట్,ఆక్ట్రాయ్, ప్రవేశ, లగ్జరీ తదితర పన్నులూ దీని పరిధిలోకే వచ్చేస్తాయి. ఆ విధంగా ఒకే పన్నుల విధానం అమలు అవుతుంది.