జాతీయ వార్తలు

విడుదలను ఆపలేం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: నిర్భయ కేసులో మైనర్‌కు శిక్ష కొనసాగింపు విషయంలో జరిగిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యువతిపై అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన నేరస్థుడు నిర్బంధం నుంచి బయటకు రాకూడదని బాధితురాలి కుటుంబం, బాసటగా నిలిచిన మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు చేసిన ప్రయత్నాలు కోర్టువద్ద నిలవలేదు. బాల నేరస్థుడు ఆదివారం బయటకు రావడానికి దారులు తెరుచుకున్నాయి. 2012 డిసెంబర్ 16న ఢిల్లీలో నడుస్తున్న బస్సులో సామూహిక అత్యాచారానికి గురై, తరువాత సింగపూర్ ఆస్పత్రిలో మృతి చెందిన వైద్య విద్యార్థిని ‘నిర్భయ’ కేసులో దోషిగా శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్న బాల నేరస్థుడి విడుదలను అడ్డుకోలేమని ఢిల్లీ హైకోర్టు శుక్రవారం తేల్చిచెప్పింది. ప్రస్తుత చట్టాల ప్రకారం శిక్షాకాలం ముగిసిన తరువాత అతను బయటకు వెళ్లకుండా నిరోధించడం వీలుకాదని హైకోర్టు స్పష్టం చేసింది. ప్రస్తుతం 20ఏళ్ల వయసున్న ఈ నేరస్థుడి మూడేళ్ల జైలుశిక్ష గడువు ఈనెల 20తో పూర్తవుతుంది. సుప్రీంకోర్టు నిలిపివేస్తే (స్టే మంజూరు చేస్తే) తప్ప అతను ఈనెల 20న విడుదల కావడం తథ్యమైంది. అయితే నేరస్థుడి విడుదలను ఆపాలంటూ ఢిల్లీ మహిళా సంఘం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అతడిలో ఆశించిన మార్పు వచ్చే వరకూ నిర్బంధంలోనే ఉంచాల్సిన అవసరం ఎంతో ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్టప్రతికి, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాసింది. ఇదిలా ఉండగా జైలుశిక్షను అనుభవిస్తున్న ఆ యువకుడు విడుదలైన తరువాత అతనికి కల్పించాల్సిన పునరావాసం, సామాజిక స్రవంతిలో కలవడానికి సంబంధించిన అంశాలపై అతనితో, అతని తల్లిదండ్రులతో, మహిళా శిశు అభివృద్ధి శాఖకు చెందిన సంబంధిత అధికారులతో మాట్లాడాలని కూడా ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.రోహిణి, న్యాయమూర్తి జయంత్‌నాథ్‌తో కూడిన హైకోర్టు ధర్మాసనం జువెనైల్ జస్టిస్ బోర్డ్‌ను ఆదేశించింది. అమానుష నేరానికి పాల్పడిన దోషిని కేవలం బాల నేరస్థుడనే కారణంతో విడుదల చేయకూడదని వాదిస్తూ, అతని విడుదలను నిలిపివేయాలని కోరుతూ బిజెపి నాయకుడు సుబ్రహ్మణ్యస్వామి దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చింది. జువెనైల్ జస్టిస్ యాక్ట్‌లోని సెక్షన్ 15(1) ప్రకారం బాల నేరస్థుడిని గరిష్ఠంగా మూడేళ్లు మాత్రమే స్పెషల్ హోంలో ఉంచడానికి వీలుకలుగుతుందని, ఈ మూడేళ్ల శిక్షాకాలం 2015 డిసెంబర్ 20నాటికి పూర్తవుతుందని, అందువల్ల తరువాత కూడా అతన్ని స్పెషల్ హోంలో ఉంచాలని ఆదేశించజాలమని హైకోర్టు స్పష్టం చేసింది.
ఢిల్లీ గ్యాంగ్ రేప్ కేసులో మైనర్ సహా ఆరుగురిని కోర్టు నిందితులుగా విచారించగా, అందులో రాంసింగ్ అనే వ్యక్తి విచారణ ఖైదీగా ఉండగానే ఆత్మహత్య చేసుకున్నాడు. మరో నలుగురు- ముకేశ్, వినయ్, పవన్, అక్షయ్‌లకు ట్రయల్ కోర్టు ఉరిశిక్ష విధించగా, తరువాత హైకోర్టు సమర్థించింది. వారి క్షమాభిక్ష పిటిషన్లు ప్రస్తుతం సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్నాయి.
నేరమే గెలిచింది: బాధితుల ఆవేదన
‘జర్మ్ జీత్ గయా, హమ్ హర్ గయా’ (నేరం గెలిచింది, మేము ఓడిపోయాం). శుక్రవారం ఢిల్లీ హైకోర్టు తీర్పు వెలువడిన తరువాత డిసెంబర్ 16 గ్యాంగ్‌రేప్ బాధితురాలి కుటుంబం స్పందన ఇది. ‘మూడేళ్లపాటు మేము ఎంతో కృషి చేసినప్పటికీ, మన ప్రభుత్వం, మన కోర్టులు ఓ నేరస్థుడిని విడుదల చేస్తున్నాయి. మాకు న్యాయం చేస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదు. మేమెంతో నిరాశా నిస్పృహలకు గురయ్యాం’ అని బాధితురాలి తల్లి ఆశాదేవి వ్యాఖ్యానించారు. న్యాయం కోసం మూడేళ్లపాటు చేసిన కృషి వృథా అయ్యిందని, నేరస్థుడు బయటకు వస్తున్నాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.