జాతీయ వార్తలు

‘జిఎస్‌టి’పై వ్యూహ రచనకు రాహుల్ మంతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) పనున్నను తీసుకురావడానికి సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లు ముసాయిదా ప్రతులను ప్రభుత్వం ఎంపీలందరికీ పంపడం, బుధవారం రాజ్యసభలో ఈ బిల్లు చర్చకు రానుండడంతో దీనిపై సభలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేసుకోవడానికి కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌సభలో పార్టీ నేత మల్లికార్జున ఖర్గే, మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం, రాజ్యసభలో పార్టీ ఉపనాయకుడు ఆనంద్ శర్మ తదితర నేతలతో పార్లమెంటు హౌస్‌లో సమావేశమై ఈ బిల్లుకు సంబంధించిన వివిధ అంశాలపై చర్చించారు. రాహుల్ గాంధీ మరో విడత పార్టీ నేతలతో సమావేశమవుతారని, ఆ తర్వాత ఆనంద్ శర్మ బిల్లుపై పార్టీ అభిప్రాయాన్ని తెలియజేయడానికి అరుణ్ జైట్లీని కలుస్తారని పార్టీవర్గాలు తెలిపాయి. భారత దేశ చరిత్రలోనే పన్నులకు సంబంధించి అత్యంత విప్లవాత్మకమైన సంస్కరణగా భావిస్తున్న ఈ బిల్లుకు కాంగ్రెస్‌తో పాటుగా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వవచ్చన్న సంకేతాలు వెలువడుతున్న విషయం తెలిసిందే. రాజ్యసభలో బిల్లుపై చర్చ జరిగి దాన్ని ఆమోదించడానికి ముందే ఏకాభిప్రాయాన్ని సాధించడానికి అన్ని ప్రధాన పార్టీలతోను చర్చలు జరుగుతున్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. రాజ్యసభలో బుధవారం ఈ బిల్లును ప్రశేశపెడతామని, అన్ని రాజకీయ పార్టీలతో ఇప్పటికే మాట్లాడామని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్ మంగళవారం బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం అనంతరం విలేఖరులకు చెప్పారు. జిఎస్‌టి బిల్లు ఏకాభిప్రాయంతో ఆమోదం పొందుతుందని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.