జాతీయ వార్తలు

పర్సేకర్ సర్కార్‌పై ప్రతిపక్షాల అవిశ్వాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, ఆగస్టు 2: గోవాలో ముఖ్యమంత్రి పర్సేకర్ నేతృత్వంలోని బిజెపి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు మంగళవారం శాసనసభలో అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించాయి. ఈ అవిశ్వాస తీర్మానంపై కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్లు, గోవా వికాస్ పార్టీ శాసన సభ్యుడు ఫ్రాన్సిస్కో మిక్కీ పచెకోలు సంతకం చేశారు. అయితే కాంగ్రెస్‌కు చెందిన మరో శాసన సభ్యుడు వౌవిన్ గోడినో, గోవా వికాస్ పార్టీకి చెందిన కైటన్ సిల్వా మాత్రం ఈ అవిశ్వాస తీర్మానంపై సంతకం చేయడానికి నిరాకరించారు.
గోవా అసెంబ్లీలో 40 మంది ఎమ్మెల్యేలున్నారు. ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్, మాజీ స్పీకర్ రాజేంద్ర అర్లేకర్‌లు సభా కార్యకలాపాలను హైజాక్ చేస్తున్నారని, సభా కార్యక్రమాలను సక్రమంగా నిర్వహించడంలో స్పీకర్ అనంత్ షేట్ పూర్తిగా విఫలమైనారని అవిశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ రాణే చెప్పారు. అలాగే నీటి టారిఫ్‌ను 5 శాతం పెంచాలని రాష్ట్ర పిడబ్ల్యుడి శాఖ మంత్రి రామకృష్ణ ధవలికర్ చేసిన డిమాండ్‌ను కూడా తాము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు. కాగా, ప్రతిపక్ష సభ్యులు అడిగిన పలు ప్రశ్నలను వేరే కేటగిరీకి మార్చివేయడం ద్వారా సభలో చర్చ జరక్కుండా చేస్తున్నారని ఇండిపెండెంట్ సభ్యుడు విజయ్ సర్దేశాయ్ ఆరోపించారు.