జాతీయ వార్తలు

థెరెసాకు సెయింట్‌హుడ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, డిసెంబర్ 18: నోబెల్ శాంతిబహుమతి గ్రహీత, ఆర్తులను ప్రేమగా అక్కున చేర్చుకుని కరుణామయిగా నిలిచిపోయిన మదర్ థెరెసాను సన్యాసినిగా ప్రకటించనున్నారు. దివంగత మదర్ థెరెసాలోని అతీత శక్తిని పోప్ ప్రాన్సిస్ గుర్తించిన తర్వాత ఆమెను సెయింట్‌గా ప్రకటించడానికి మార్గం సుగమం అయింది. మదర్ థెరెసాకు చెందిన రెండవ అద్భుతాన్ని చర్చి ధ్రువీకరించిందని, మదర్ థెరెసాకు సెయింట్‌హుడ్‌ను ఇవ్వనున్నట్లు వాటికన్‌నుంచి తమకు ఇప్పుడే అధికారిక ధ్రువీకరణ అందిందని, ఈ వార్త తెలిసి తమకు ఎంతో సంతోషంగా ఉందని మిషనరీ ఆఫ్ చారిటీ ప్రతినిధి సునీతా కుమార్ శుక్రవారం పిటిఐతో అన్నారు. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో ఈ దివంగత సన్యాసినికి అధికారికంగా సెయింట్‌హుడ్‌ను ప్రకటిస్తారని తెలుస్తోంది. మదర్ థెరెసా ప్రార్థనల వల్ల బ్రెయిన్ ట్యూమర్లతో బాధపడుతున్న బ్రెజిల్‌కు చెందిన ఒక వ్యక్తికి వ్యాధి నయమైనట్లు త్రిసభ్య కమిటీ ధ్రువీకరించిందని వాటికన్ ఒక ప్రకటనలో పేర్కొన్నట్లు ఒక మీడియా కథనం తెలిపింది.
మదర్ థెరెసా మిషన్ ఆఫ్ చారిటీస్ సంస్థను ఏర్పాటు చేయడంతో పాటు కోల్‌కతా వీధుల్లోని పేదలు, అనాథలు, రోగగ్రస్థులై చనిపోతున్న వారికి 45 ఏళ్ల పాటు సేవలు అందించారు. 87వ ఏట 1997లో ఆమె కోల్‌కతాలో మరణించారు. మదర్ థెరెసాను సెయింట్‌గా గుర్తించాలన్న వాటికన్ సిటీ నిర్ణయం పట్ల పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మిషనరీస్ ఆఫ్ చారిటీని అభినందించారు. 2016లో మదర్ థెరెసాను సెయింట్‌గా ప్రకటించనున్నారన్న వార్తను ఇప్పుడే విన్నానని, ఈ సంతోష సమయంలో మిషనరీస్ ఆఫ్ చారిటీకి నా శుభాకాంక్షలని మమత ఒక ప్రకటనలో పేర్కొన్నారు.