జాతీయ వార్తలు

ఇది చారిత్రక విజయం : మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశంలో పరోక్ష పన్నులకు సంబంధించి విప్లవాత్మక మార్పు తీసుకువచ్చే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)కు సంబంధించిన రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించటం చారిత్రక పరిణామమని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. ప్రభుత్వం చేపట్టిన ఈ బృహత్తర లక్ష్య సాధనకు సహకరించిన అన్ని పార్టీల నాయకులకు ధన్యవాదాలు చెప్పారు. సహకార సమాఖ్య విధానానికి జిఎస్‌టి బిల్లు ఆమోదం తిరుగులేని దృష్టాంతమన్నారు. అన్ని పార్టీలు కలిసికట్టుగా పనిచేస్తే భారత్‌ను మరిన్ని శిఖరాలను అధిరోహించేలా చేయవచ్చని ట్వీట్ చేశారు. భారతీయులందరికీ ప్రయోజనం కలిగించే ఏ వ్యవస్థనైనా పాదుగొల్పేందుకు పార్టీలతోనూ, రాష్ట్రాలతోనూ కలసికట్టుగా ముందుకు సాగుతామన్నారు.