జాతీయ వార్తలు

జయహో.. జిఎస్‌టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఏకీకృత మార్కెట్ దిశగా భారత్ బలమైన ముందడుగు వేసింది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఎన్నడూ చేపట్టని రీతిలో అతిపెద్ద పన్నుల సంస్కరణల వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సెంట్రర్ ఎక్సైజ్ సుంకం,రాష్ట్రాల వ్యాట్/ అమ్మకం పన్నులు సహా అన్ని రకాల పరోక్ష పన్నులు ఒకే జిఎస్‌టి పన్నుల విధానం పరిధిలోకి వచ్చే వ్యవస్థకు ఊతం లభించింది. గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న వస్తు సేవల పన్ను (జిఎస్‌టి)కి సంబంధించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లును రాజ్యసభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఒకే దేశం ఒకే మార్కెట్ అన్న బలమైన సంకేతాల్ని అందించింది. అధికార విపక్షాల మధ్య తలెత్తిన విభేదాల మధ్య చిక్కుకుని వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చిన ఈ చారిత్రక బిల్లుపై దాదాపు ఏడు గంటల పాటు జరిగిన సుదీర్ఘ చర్చ జరిగింది. అనంతరం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సవివరమైన సమాధానం ఇచ్చారు. అనంతరం జరిగిన ఓటింగ్‌లో 203మంది సభ్యులూ దీనికి అనుకూలంగా ఓటు వేశారు. ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు. ఒక శాతం అదనపు పన్నును తొలగించడం సహా ఆరు అధికారిక సవరణలకూ పూర్తి స్థాయి మద్దతు లభించింది. వివిధ రాష్ట్రాల్లో విధిస్తున్న పన్నులు, స్థానిక పన్నుల స్థానే అన్ని చోట్లా ఒకే పన్ను విధానానికి జిఎస్‌టి బలమైన పునాది అవుతుంది. ఇప్పటికే ఈ బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించింది. అయితే ఆరు అధికారిక సవరణలను ప్రతిపాదించినందున మళ్లీ దీన్ని లోక్‌సభ ఆమోదానికి పంపాల్సి ఉంటుంది. అలాగే 50శాతం రాష్ట్రాల అసెంబ్లీలూ ఈ రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదించాల్సి ఉంటుంది. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, విపక్షాల మధ్య సామరస్య, సయోధ్యభ వాతావరణం అడుగడుగునా ద్యోతకమైంది. చర్చకు సమాధానం చెప్పిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ జిఎస్‌టి రేటును సాధ్యమైనంత తక్కువగానే ఉంచేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. ఈ రేటును చెప్పాలని విపక్షాలు డిమాండ్ చేసినప్పటికీ ఆయన ఎలాంటి సంకేతాన్ని అందించలేదు. అయితే జిఎస్‌టి అమలు వేగాన్ని పుంజుకునే కొద్దీ ఈ పన్ను రేటూ తగ్గుతూ వస్తుందని మాత్రం వెల్లడించారు. ఆర్థిక మంత్రి, 29రాష్ట్రాల ప్రతినిధులతో కూడిన జిఎస్‌టి మండలి ఈ పన్ను రేటును నిర్ణయిస్తుందన్నారు. దేశంలో 80శాతానికి పైగా వస్తువులపై 12.5శాతం మేర కేంద్ర పన్నులు ఉన్నాయని, రాష్ట్రాల స్థాయిలో 55శాతం వస్తువులపై 14.5శాతం మేర వ్యాట్ లేదా అమ్మకపు పన్నులు విధిస్తున్నారని జైట్లీ తెలిపారు. జిఎస్‌టి రేటు ఎలా ఉండాలన్న దానిపై రెండు అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నామన్నారు. కేంద్ర, రాష్ట్రాలు ప్రస్తుతం విధిస్తున్న ఉమ్మడి సగటు పన్ను 27శాతం ఉందని, దీని వల్ల ప్రజలపై భారం పడటం, ద్రవ్యోల్బణం పెరగడం అనివార్యమవుతాయన్నారు. దీన్ని గణనీయంగా తగ్గించడం ఒకటైతే రెండోది ప్రస్తుత రెవిన్యూ అవసరాలకు అనుగుణంగా పన్నును వసూలు చేయడమేనని అన్నారు. జిఎస్‌టి మద్దతు బిల్లు నవంబర్‌లో సభకు వస్తుందని, అప్పుడు అన్ని అంశాలపైనా మాట్లాడే అవకాశం సభ్యులకు కలుగుతుందని తెలిపారు. జిఎస్‌టి అమలు వల్ల వ్యవస్థ మరింత సమర్థవంతంగా పనిచేసే అవకాశం ఉంటుందని, పన్నులు కట్టడం ఎంత సులభతరమో..వాటి నుంచి తప్పించుకోవడం అంతే కష్టతరమవుతుందన్నారు. పన్నుల ఎగవేతను ఏదో దశలో గుర్తించడం సాధ్యమవుతుందని చెప్పారు.
................................................................................................................
‘జిఎస్‌టి పన్నును కనిష్ట స్థాయిలో ఉంచుతాం. పన్నుల ఎగవేతకు ఆస్కారం ఉండదు.
భారం మరింత తగ్గుతుంది’
అరుణ్ జైట్లీ
................................................................................................................