జాతీయ వార్తలు

‘కేంద్రం హామీతోనే ఆందోళన విరమణ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు పరిష్కారానికి కేం ద్రం హామీ ఇచ్చినందునే ప్రస్తుతానికి ఆందోళనలు విరమించినట్లు టీపీపీ ఎంపీలు చెప్పారు. బుధవారం నాడు టీడీపీ ఎంపీలు మురళీమోహన్, అవంతిశ్రీనివాస్, రామ్మోహన్‌నాయుడు విలేకరులతో మాట్లాడారు. కేంద్ర మంత్రులు అరుణ్‌జైట్లీ, అనంత్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కి తప్పక సాయం చేస్తామని చెప్పారని అందుకే నిరసనలకు విరామం ఇచ్చామన్నారు. ఏపీ ప్రయోజనల కోసం ఎంపీ పదవులకు రాజీనామా చేయటానికి కూడా సిద్ధం అన్నారు.కేంద్రం విషయంలో వేచిచూసే దోరణి అవలంబిస్తున్నామని, ఫలితం రాకపోతే తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేంద్రంతో లాలూచీ పడి నిరసనలను ఆపామనటంలో వాస్తవం లేదన్నారు.

హోదా సాధనలో టిడిపిది ద్వంద్వ వైఖరి
వైకాపా ఎంపీ మేకపాటి

న్యూఢిల్లీ, ఆగష్టు 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి విమర్శించారు. హోదా సాధనలో టీడీపీ చేపట్టిన ఆందోళనకు రెండు రోజులకే విరామం ప్రకటించిందని ఆరోపించారు. లోక్‌సభలో ప్రత్యేక హోదా అంశానికి సంబంధించి కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటన చేసిన సమయంలో సభలో లేమని టీడీపీ ఎంపీ సీఎం.రమేశ్ విమర్శించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించాలని వైఎస్సార్ కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉందని అందుకే గత రెండున్నరేళ్లుగా తమ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోందని చెప్పారు. అందుకోసం మా పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి ఆమరణదీక్ష చేపట్టారని, రాష్టప్రతి, ప్రధాని మంత్రిని కలిశారని ఆయన గుర్తు చేశారు.

బిసిల జాబితాలో మార్పులు

న్యూఢిల్లీ, ఆగస్టు 3: రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 121 కులాలను కేంద్ర ఇతర వెనుకబడిన కులాల జాబితాలో చేరుస్తున్నారు. తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన కేంద్ర ఓబిసి (ఆదర్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్) జాబితాలో అవసరమైన మార్పులు చేర్పులు చేసేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ చేసిన సిఫారసుల మేరకు కేంద్ర ఒబిసి జాబితాలో ఈ మార్పులు,చేర్పులు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన 35 కొత్త కులాలను కేంద్ర ఒబిసి జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన కులాల కమీషన్ సిఫారసు చేసింది. ఇదే విధంగా తెలంగాణా రాష్ట్రానికి సంబంధించి 86 కులాలను కేంద్ర ఒబిసి జాబితాలో చేర్చాలని జాతీయ వెనుకబడిన కులాల కమీషన్ సిఫారసు చేసింది. కేంద్ర ఒబిసి జాబితాలో ఈ మార్పులు చేయటం వలన ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలోని ఈ కులాల వారు ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల సౌకర్యం పొందేందుకు వీలు కలుగుతుంది. ఈ కులాల వారికి వివిధ సంక్షేమ పథకాల ప్రయోజనాలు పొందేందుకు వీలు కల్పించటంతోపాటు ఉపకార వేతనాలు తీసుకునేందుకు వీలుకలుగుతుంది.