జాతీయ వార్తలు

నిలకడగా సోనియా ఆరోగ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: మంగళవారం అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరిన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి బుధవారం నిలకడగా ఉంది. మంగళవారం రాత్రి ఆర్మీకి చెందిన రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆమెను బుధవారం పశ్చిమ ఢిల్లీలోని గంగారాం ఆస్పత్రికి తరలించారు. మంగళవారం ఉత్తరప్రదేశ్ పర్యటనకు వెళ్లిన సోనియాగాంధీ అనారోగ్యానికి గురికావడంతో మార్గమధ్యంలో వారణాసిలో పాల్గొనవలసి ఉండిన సుమారు ఎనిమిది కిలోమీటర్ల రోడ్‌షోను రద్దు చేసుకుని హుటాహుటిన అద్దె విమానంలో ఢిల్లీకి వచ్చి ఆర్మీ ఆస్పత్రిలో చేరారు. అయితే ఆమె గతంలో గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందడంతో బుధవారం ఆమెను గంగారాం ఆస్పత్రికి తరలించినట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సోనియాగాంధీ తనయుడు రాహుల్ గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ ఆమె పక్కన ఉన్నారు. అల్లుడు రాబర్ట్ వాద్రా కూడా ఆస్పత్రికి చేరుకొని ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. సోనియాగాంధీ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్న ఆమె కోలుకుంటున్నారని ఎఐసిసి మీడియా సెల్ ఇన్‌చార్జ్ రణదీప్ సుర్జేవాలా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

ప్రత్యేక హోదా ఇవ్వకుండా
ఏపి అభివృద్ధి అసాధ్యం

రాజ్యసభలో వైకాపా ఎంపి విజయసాయి రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా ఇవ్వక తప్పదని వైకాపా సభ్యుడు విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డి బుధవారం రాజ్యసభలో జిఎస్‌టికి సంబంధించిన 122వ రాజ్యాంగ సవరణ బిల్లుపై జరిగిన చర్చలో పాల్గొంటూ ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం సాధ్యం కాదన్నారు. జిఎస్‌టిని అమలు చేయటం వలన రాష్ట్రానికి దాదాపు ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుందని, ఈ నష్టాన్ని పూడ్చవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదా? అని ఆయన నిలదీశారు. విభజన మూలంగా రాష్ట్ర ఆర్థిక లోటు భారీగా పెరిగిందంటూ, మొదటి అయిదేళ్ల లోటును కేంద్రం నూటికి నూరు శాతం పూడ్చాలని డిమాండ్ చేశారు.
ఐదు సంవత్సరాల పాటు పూర్తి లోటును కేంద్రం భరించినప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు. రాష్ట్రం ఆర్థిక లోటును ఆరో సంవత్సరంలో యాభై శాతం, ఏడో సంవత్సరం కనీసం 25 శాతం కేంద్ర ప్రభుత్వం భరించాలని విజయసాయి రెడ్డి డిమాండ్ చేశారు.