జాతీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్లు పెంచాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రెండు తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో సీట్ల పెంపుదల, రెండు రాష్ట్రాల్లో హైకోర్టుల ఏర్పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుప్రీంకోర్టు బెంచిలను ఏర్పాటు చేయాలంటూ టిఆర్‌ఎస్ ఎంపి బి.వినోద్‌కుమార్ మూడు ప్రైవేట్ బిల్లులను లోకసభలో శుక్రవారం ప్రతిపాదించారు. సీనియర్ నాయకుడు బి.వినోద్‌కుమార్ ప్రతిపాదించిన ఈ మూడు బిల్లులపై చర్చ జరిపేందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ తమ ఆమోదం తెలిపారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభలోని సీట్ల సంఖ్యను 175 నుండి రెండు వందలు ఇరవై ఐదు, తెలంగాణ శాసన సభలోని సీట్ల సంఖ్యను 119 నుండి 153కు పెంచాలన్నది వినోద్‌కుమార్ ప్రతిపాదించిన మొదటి ప్రైవేట్ మెంబర్ బిల్లు. ఈ లక్ష్య సాధన కోసం రాష్ట్ర విభజన బిల్లును సవరించాలని ఆయన తమ బిల్లులో ప్రతిపాదించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం రెండు రాష్ట్రాలకు రెండు హైకోర్టులు ఉండాలని నిర్ధారించినా ఇంతవరకు హైకోర్టు విభజన జరగలేదు, రెండు రాష్ట్రాల్లో రెండు హైకోర్టులను ఏర్పాటు చేసేందుకు వీలుగా రాష్ట్ర విభజన చట్టాన్ని సవరించాలని ఆయన తమ రెండో ప్రైవేట్ మెంబర్ బిల్లులో డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో రెండు సుప్రీంకోర్టు బెంచీలను ఏర్పాటు చేసే విధంగా కేంద్ర చట్టాన్ని సవరించాలన్నది వినోద్‌కుమార్ మూడో బిల్లు డిమాండ్.