జాతీయ వార్తలు

మీ వాళ్లకు జరిగుంటే ఆ బాధ తెలిసేది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ గ్యాంగ్‌రేప్ ఘటన సమాజ్‌వాదీ పార్టీ, బిజెపి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. బులంద్‌షహర్‌లో తల్లీ, 13 ఏళ్ల కుమార్తెపై బందిపోట్ల ముఠా అత్యాచారం చేసింది. అయితే ఇదంతా ప్రతిపక్షాల కుట్రేనని, అధికారంలోకి రావాలన్న దురుద్దేశంతోనే రాజకీయం చేస్తున్నారని సమాజ్‌వాదీ పార్టీ సీనియర్ మంత్రి ఆజంఖాన్ ఆరోపించారు. దీనిపై బిజెపి తీవ్రంగా మండిపడింది. యూపీ బిజెపి అధికార ప్రతినిధి ఐపి సింగ్ మంత్రి ఖాన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ ట్వీట్ చేశారు. ‘నీ కూతురుకో, భార్యకో జరిగి ఉంటే ఆ బాధ ఏమిటో తెలుస్తుంది’ అని సింగ్ అన్నారు. సింగ్ ట్వీట్‌లపై పెద్దఎత్తున విమర్శలు వచ్చినా ఆయన తన మాటలను సమర్థించుకున్నారు. అజాంఖాన్‌పై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోబోనని కూడా సింగ్ స్పష్టం చేశారు. ‘నేను నా భార్య కూడా మా కుమార్తెల భద్రతపై ఆందోళన చెందుతున్నాం’ అని సింగ్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లో మహిళలకు రక్షణ లేదనడానికి బులంద్‌షహర్ ఘటనే ఉదాహరణ అని కాంగ్రెస్ దుయ్యబట్టింది. ఎస్‌పి మంత్రి ఖాన్ వ్యాఖ్యలను కాంగ్రెస్ తప్పుపట్టింది.

పార్లమెంటుకు అనుమతించండి
విచారణ పొడిగింపుపై ఆప్ ఎంపి మాన్

చండీగఢ్, ఆగస్టు 3: పార్లమెంటులో వీడియో తీసిన ఘటనపై విచారణ జరిపేందుకు ఏర్పాటైన లోక్‌సభ ప్యానెల్ విచారణను మరో రెండు వారాలు పొడిగించిన నేపథ్యంలో తనను పార్లమెంటు సమావేశాలకు అనుమతించాలని ఆప్ ఎమ్మెల్యే భగవంత్‌మాన్ డిమాండ్ చేశారు. పేదలు, దళితుల స్వరాన్ని సభలో వినిపించనివ్వకుండా తన గొంతు నొక్కుతున్నారని ఆయన ఆరోపించారు.
విచారణ పూర్తయ్యేవరకు తనను సభలోకి అనుమతించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. ‘వాళ్లు (ప్యానెల్) నన్ను బయటకు తోసేయవచ్చు. కనీసం వాళ్ల నిర్ణయం త్వరగా వెల్లడించాలి. ఇప్పుడు మళ్లీ రెండు వారాలు పొడిగించారు. విచారణ జరుగుతున్నప్పటికీ తనను పార్లమెంటుకు అనుమతించాలి. నామీద నేరం నిరూపణ కాలేదు. నా గొంతు నొక్కాలని చూస్తున్నారు’ అని మాన్ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. పార్లమెంటులో వీడియో తీసిన ఘటనపై ఏర్పడిన లోక్‌సభ ప్యానెల్ విచారణ గడువును స్పీకర్ సుమిత్రా మహాజన్ మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న కొద్ది గంటల వ్యవధిలోనే మాన్ పైవిధంగా వ్యాఖ్యానించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే బేషరతుగా క్షమాపణ చెప్పానన్నారు. స్పీకర్‌కు తాను ఇచ్చిన సమాధానాన్ని మార్చాలని వారు చూస్తున్నారని, దాన్ని మార్చేది లేదని మాన్ స్పష్టం చేశారు.