జాతీయ వార్తలు

హోదాపై జైట్లీ తప్పుదోవ పట్టించారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డంకి అని ప్రజలను, సభను కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. బుధవారం కాంగ్రెస్ నాయకులు జైరాం రమేశ్, కెవిపి రామచంద్రరావు, సుబ్బిరామిరెడ్డి, జెడి శీలంలు విలేఖరులతో మాట్లాడారు. రాజ్యసభ సభ్యుడు జైరాం రమేశ్ మాట్లాడుతూ, ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ప్రత్యేక హోదా రద్దు చేయలేదన్నారు. అలాగే 14వ ఆర్థిక సంఘం ప్రత్యేక హోదా రద్దుకు సంబంధించి ఎలాంటి సిఫార్సు చేయలేదని ఆయన స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా ఇవ్వాలా లేదా? అన్నది కేంద్ర ప్రభుత్వ అంశమని, కాని 14 వ ఆర్థిక సంఘం మీద నెడుతూ కేంద్ర మంత్రులు, బిజెపి నాయకులు అవాస్తవాలు చెప్తున్నారనీ ఆరోపించారు. అసలు రాష్ట్రాల ప్రత్యేకహోదాకు, ఆర్థిక సంఘానికి ఎటువంటి సంబంధం లేదని, ఇది నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకొనే నిర్ణయం మాత్రమే అని వెల్లడించారు. రాష్ట్రాలకు ప్రత్యేకహోదా రద్దుకు సంబంధించి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. దీనిపై ఆర్థిక సంఘం సభ్యుడు అభిజిత్ సేన్ తనకు ఈ- మెయిల్ చేశారని వివరించారు. నరేంద్ర మోదీ ప్రభుత్వం కావాలనే తనకు తానుగా ప్రత్యేక హోదాను రద్దు చేసిందని ఆరోపించారు. దేశంలోప్రస్తుతం 11 రాష్ట్రాలు ప్రత్యేకహోదా కల్గివుంటే, అందులో ఎక్కువ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలేనని చెప్పారు. రాష్ట్రాలకు హోదా రద్దు అన్నది రాజకీయంతో తీసుకొనే నిర్ణయమన్నారు.
విభజన హామీల విషయంలో టిడిపి, బిజెపిలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు అమలు చేయటంలో టిడిపి, బిజెపిలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. తెలుగుదేశం పార్టీ ఒక డ్రామా పార్టీ అని, ఈ రెండు పార్టీలు కలిసి పార్లమెంట్‌లో డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు. విభజన హామీలు విషయంలో అన్ని పార్టీలు ఒకే మాటతో ఉన్నాయని, అన్ని పార్టీలు కలిసి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. రాజ్యసభలో గత నెల 29న ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సభను తప్పుదోవ పట్టించినందుకే కాంగ్రెస్ వాకౌట్ చేసిందని చెప్పారు.