జాతీయ వార్తలు

అంతిమ నిర్ణయం అమిత్‌దే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 3: గుజరాత్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆనందీబెన్ పటేల్ వారసుడి ఎంపిక బాధ్యతను బిజెపి పార్లమెంటరీ పార్టీ పార్టీ అధ్యక్షుడు అమిత్ షాకు బుధవారం అప్పగించింది. అమిత్ షా గురువారం గుజరాత్ వెళ్తున్నారు. అక్కడ ఆయన పార్టీ నాయకులతో చర్చలు జరపడమే కాకుండా లెజిస్లేచర్ పార్టీ కొత్త నాయకుడి ఎంపికకోసం శుక్రవారం జరగనున్న లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి కూడా హాజరవుతారు. శుక్రవారం కొత్త లెజిస్లేచర్ పార్టీ నాయకుడ్ని ఎన్నుకోవడానికి పార్టీ పరిశీలకులుగా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని, బిజెపి ప్రధాన కార్యదర్శి సరోజ్ పాండేను పార్లమెంటరీ పార్టీ నియమించినట్లు సమావేశం అనంతరం పార్టీ సీనియర్ నాయకుడు ఎం వెంకయ్య నాయుడు విలేఖరులకు చెప్పారు. అమిత్ షా అధ్యక్షతన జరిగిన బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యారు. ముఖ్యమంత్రి పదవికి అమిత్ షా అభ్యర్థిగా ఉండే అవకాశమే లేదని వెంకయ్య స్పష్టం చేస్తూ, జాతీయ స్థాయిలో ఆయన పార్టీకి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆనందీబెన్ వారసుడు రాష్ట్ర ఎమ్మెల్యేలనుంచే ఉంటారని కూడా ఆయన స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పదవికి అమిత్ షా కూడా పోటీలో ఉన్నారా? అన్న విలేఖరుల ప్రశ్నకు ‘అలాంటి ప్రశే్న తలెత్తదు. ఆయన పార్టీ అధ్యక్షుడు. పార్టీ అధ్యక్షుడిగానే ఉంటారు. జాతీయ స్థాయిలో పార్టీకి ఆయన నాయకత్వం అవసరం. అలాంటి చర్చ ఏదీ అసలు జరగనే లేదు’ అని వెంకయ్య నాయుడు స్పష్టం చేశారు. అమిత్ షా పార్టీని అత్యున్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన నాయకత్వంలో పార్టీ ఎన్నో విజయాలు సాధించిందని వెంకయ్య చెప్పారు. వయోభారం కారణంగా ముఖ్యమంత్రి పదవినుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆనందీబెన్ పటేల్ గత సోమవారం ప్రకటించిన విషయం తెలిసిందే. 75 ఏళ్లు నిండిన వారెవరూ ఎలాంటి ప్రభుత్వ పదవులు చేపట్టకూడదని బిజెపి అంతర్గతంగా ఒక సంప్రదాయం పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆనందీబెన్ పటేల్ త్వరలో 75 ఏట అడుగుపెట్టనున్నారు.
బాధ్యతలనుంచి తప్పించాలన్న ఆనందీబెన్ కోరికకు పార్లమెంటరీ బోర్డు తన ఆమోదం తెలియజేసిందని, అంతకుమించి ఆమె స్థానంలో ఏ అభ్యర్థి గురించి బోర్డు చర్చించలేదని వెంకయ్య స్పష్టం చేశారు. లక్షలాది పార్టీ కార్యకర్తలకు ఆమె ఒక గొప్ప సంప్రదాయాన్ని నెలకొల్పారని, ముఖ్యమంత్రిగా, అంతకుముందు మంత్రిగా ఆమె చేసిన గొప్ప సేవలను బోర్డు గుర్తించిందని ఆయన చెప్పారు. కాగా, అమిత్ షా గుజరాత్ అసెంబ్లీ ఎమ్మెల్యే అని వెంకయ్య నాయుడు చెప్తూ, లెజిస్లేచర్ పార్టీ సమావేశానికి ఆయన హాజరవుతారని చెప్పారు. ఆనందీబెన్ స్థానంలో గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి రేసులో నితిన్ పటేల్, గుజరాత్ బిజెపి అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి అయిన విజయ్ రూపానీలు అందరికన్నా ముందున్నారు.

బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పాల్గొన్న ప్రధానిమోదీ, అమిత్‌షా తదితరులు