జాతీయ వార్తలు

మహారాష్టల్రో కూలిన వంతెన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహద్, ఆగస్టు 3: వరదల ధాటికి మహారాష్ట్ర అల్లల్లాడిపోతోంది. రాష్ట్రంలోని సా విత్రి నది ఉప్పొంగటంతో రాయ్‌గఢ్ జిల్లా మహద్ ప్రాంతంలో ముంబై-గోవా రహదారిపై బ్రిటిష్ కాలం నాటి ఓ వంతెన మంగళవారం అర్ధరాత్రి కొట్టుకుపోయింది. ఈ ఘటనలో ప్రయాణికులతో వెళ్తున్న రెండు బస్సులు నదిలో కొట్టుకుపోయాయి. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు రెండు మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. ఇరవై మంది వరకూ ప్రయాణికులు గల్లంతైనట్లు రాయ్‌గఢ్ కలెక్టర్ శీతల్ ఉగాలె తెలిపారు. బస్సులతో పాటు కొన్ని కార్లు కూడా వరదనీటితో కొట్టుకుపోవటం తాము చూశామని ప్రత్యక్ష సాక్ష్యులు తెలిపారు. నాలుగు జాతీయ విపత్తు సహాయ బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. గజ ఈతగాళ్లు, హెలికాప్టర్ల సాయంతో గల్లంతైన వారి కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ‘‘అక్కడ రెండు సమాంతర వంతెనలు ఉన్నాయి. ఒకటి బ్రిటిష్ కాలం నాటిది. రెండోది కొత్త వంతెన. పాత వంతెన కూలిపోయింది. సహాయ చర్యలు కొనసాగుతున్నాయి’’ అని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు. తీవ్రమైన వరద ఉద్ధృతి కారణంగానే వంతెన కూలిపోయిందని దీన్ని 1928లో నిర్మించారని ఫడ్నవిస్ పేర్కొన్నారు. రెండు హెలికాప్టర్లతో పాటు తీరప్రాంత రక్షక దళాలు కూడా సహాయ చర్యల్లో పాల్గొంటున్నాయని సియం వివరించారు.
chitram...
మహారాష్టల్రో వరదల ధాటికి మంగళవారం అర్ధరాత్రి కొట్టుకుపోయిన
ముంబై-గోవా రహదారిపై బ్రిటిష్ కాలం నాటి ఓ వంతెన