జాతీయ వార్తలు

ఇకనైనా తేల్చండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/విజయవాడ, ఆగస్టు 5:ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తుత పార్లమెంట్ సమావేశాలు ముగిసేలోగా తేల్చాలని ప్రధాని మోదీని కోరినట్టు చంద్రబాబు చెప్పారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న హామీల అమలుకూ చర్యలు తీసుకోవాలని కోరానని చెప్పారు. కాగా ప్రత్యేక హోదా ఇవ్వటం, రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేసే విషయంలో ప్రధాని ఎం తో పట్టుదలతో ఉన్నారని ఆయన చెప్పా రు. ప్రధానితో భేటీ అనంతరం ఢిల్లీలోనూ, ఆ తర్వాత విజయవాడ చేరుకున్నాకా చంద్రబాబు విలేఖరులతో మాట్లాడారు. తాను చెప్పినదంతా ప్రధాని సావకాశంగా విన్నారనీ, రాష్ట్రానికి ప్రయోజనం కలిగించాలనే ఆలోచనతో ఉన్నారని సిఎం తెలిపారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారనేది కేంద్రానికి అర్థమైందన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బిజెపి, తెలుగుదేశం సంకీర్ణానికి కూడా నష్టం వాటిల్లుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. సాంకేతికపరమైన కారణాల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వటం సాధ్యం కాదనే మాట వినిపిస్తోందని ఒక విలేఖరి ప్రస్తావించగా అలాంటివి ఉంటే తొలగించుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రత్యేక హోదా అంశాన్ని తేల్చాలని ప్రధానిని కోరినట్టు ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు ఇవ్వాలని కూడా కోరానన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా ఏపిని అభివృద్ధి చేయాలని కోరానని సిఎం చెప్పారు. టైమ్ ఇచ్చి హోదా హామీని నెరవేర్చుతారా? హామీ ఇచ్చి, నిర్ణీత సమయంలోగా వాటిని నెరవేర్చుతారా? అని ప్రధానిని అడిగానని చంద్రబాబు చెప్పారు. హోదాపై ఎంపిలు ఆందోళనను తాత్కాలికంగా విరమించినా, పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తారని చంద్రబాబు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
13 అంశాలపై వినతిపత్రం
ఢిల్లీ పర్యటనలో చంద్రబాబు ప్రధాని, జైట్లీ తదితరులను కలిసి 13 అంశాలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఇందులో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, లోటు బడ్జెట్, పోలవరం ప్రాజెక్ట్‌కు నిధులు, రాజధాని నిర్మాణానికి నిధులు, పరిశ్రమలకు రాయితీలు, రాయలసీమ, ఉత్తరాంధ్రలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ మంజూరు, విభజన చట్టంలోని సెక్షన్ 9,10లోని ఆస్తుల పంపకం, సెక్షన్ 13లోని విద్యా సంస్థలకు నిర్ణీత సమయంలో నిధుల కేటాయింపు, విశాఖకు రైల్వే జోన్, దుగరాజపట్నం పోర్టు, కడపలో స్టీల్ ప్లాంట్, కాకినాడలో రిఫైనరీ ఏర్పాటు, విశాఖపట్నం, విజయవాడ మెట్రో, నదీ జలాల పంపకం, శాసనసభ సీట్ల పెంపు అంశాలు ఇందులో ఉన్నాయి.
జిఎస్‌టికి హోదా మెలిక పెట్టాల్సింది!
‘హోదాపై కాంగ్రెస్ పార్టీ ప్రైవేటు బిల్లు పెట్టింది. దానిపై పూర్తిగా చర్చించకుండానే అకస్మాత్తుగా చర్చ నుంచి బయటకు వచ్చింది. ఆ వెనువెంటనే జిఎస్‌టి బిల్లుపై ఎన్డీఏకు సహకరించింది. హోదా బిల్లును ఆమోదిస్తేనే, జిఎస్‌టి బిల్లుకు మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ఎందుకు మెలిక పెట్టలేద’ని చంద్రబాబు ప్రశ్నించారు. జిఎస్‌టి బిల్లు పాస్ అయిన తరువాత మళ్లీ హోదా గురించి చర్చించడం వలన ప్రయోజనం ఉండకపోవచ్చని అభిప్రాయపడ్డారు. హోదా అంశాన్ని కాంగ్రెస్, బిజెపిలు రాజకీయంగా ఉపయోగించుకోవాలని భావిస్తున్నాయని చంద్రబాబు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు మనీ బిల్లా? కాదా? అన్న అంశంపై తాను మాట్లాడలేనని చంద్రబాబు చెప్పారు.
జిఎస్‌టితో దీర్ఘకాలిక ప్రయోజనాలు
కేంద్ర ఆమోదించిన జిఎస్‌టి బిల్లు రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉండకూడదని చంద్రబాబు చెప్పారు. ఈ బిల్లు వలన ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి ఆదాయం సమకూరదని, దీర్ఘకాలంలో ప్రయోజనాలు ఉంటాయని చంద్రబాబు చెప్పారు.
పుష్కరాల ఆహ్వానం
కాగా చంద్రబాబు శుక్రవారం ఉదయం పార్లమెంటు ఆవరణలో లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌ను కలిసి కృష్ణ పుష్కరాలకు ఆహ్వానించారు. అలాగే బిజెపి సీనియర్ నేత అద్వానీ సహా కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, సురేష్ ప్రభు, అనంతకుమార్, జెపి నడ్డా, ఆహ్లూవాలియా, హంసరాజ్ అహిర్‌లను కూడా చంద్రబాబు కలిసి పుష్కరాలకు ఆహ్వానించారు.