జాతీయ వార్తలు

210మంది మంత్రులపై క్రిమినల్ కేసులు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రుల్లో 34శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, సగటున 8.59కోట్లతో 76శాతం మంది కోటీశ్వరులున్నారని తాజాగా జరిగిన ఓ సర్వేలో వెల్లడైంది. 29 రాష్ట్రాల అసెంబ్లీలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 620మంది మంత్రుల్లో 609మందిపై ఈ సర్వే జరిగింది. ఈ 609మంది లో 76శాతం మంది అంటే 462మంది కోటీశ్వరులేనని, వీరిలో అత్యధిక స్థాయి ఆస్తులు తెలుగు దేశం పార్టీకి చెందిన పొంగూరు నారాయణకు ఉన్నాయని తేలింది. రెండోస్థానంలో కాంగ్రెస్‌కు చెందిన శివకుమార్ ఉన్నారు. ఆయన మొత్తం ఆస్తుల విలువ 251కోట్ల రూపాయలని ఎడిఆర్ అనే ఈ సంస్థ తెలిపింది. అత్యధిక స్థాయిలో సగటు ఆస్తులు కలిగిన మంత్రుల్లో ఆంధ్ర ప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రాష్ట్రానికి చెందిన 20మంది సగటు ఆస్తులు 45.49కోట్ల రూపాయలు. ఇక నేర చరిత్ర విషయాని కొస్తే 609మంది మంత్రుల్లో 34శాతం మంది అంటే 210 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్న విషయాన్ని స్వయంగా ప్రకటించుకున్నారు. కేంద్ర మంత్రివర్గంలోని 78మందిలో 31శాతం మంది అంటే 24మంది తనపై క్రిమినల్ కేసులు ఉన్నట్టుగా ప్రకటించుకున్నారని తెలిపింది. రాష్ట్ర అసెంబ్లీలకు చెందిన 113మంది మంత్రుల్లో హత్య, కిడ్నాప్, మహిళలపై దాడులకు పాల్పడటం సహా చాలా తీవ్రమైన కేసులే ఉన్నాయని ఎడిఆర్ వెల్లడించింది. అలాగే 78మంది కేంద్ర మంత్రుల్లో 14మందిపై ఈ తరహా కేసులు ఉన్నట్టు తెలిపింది. చాలా తీవ్రమైన క్రిమినల్ కేసుల్ని ఎదుర్కొంటున్న రాష్ట్రాల మంత్రుల్లో జార్ఖండ్, తెలంగాణల్లో తొమ్మిది మంది చొప్పున, మహారాష్టల్రో 18మంది, బీహార్‌లో 11మంది ఉన్నట్టు తెలిపింది.
తెలంగాణలో 3 జిల్లాల్లోనే అధిక వర్షపాతం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఒక వైపు భారీ వర్షాలు కురుస్తుండగా, మరోవైపు పలు జిల్లాల్లో సగటు వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. అడవుల విస్తీర్ణం ఎక్కువగా ఉన్న జిల్లాల్లోనే ఎక్కువ వర్షపాతం నమోదు అయింది. రాష్ట్రంలో సగటు వర్షపాతం కన్నా 16శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. జూన్‌లో 50శాతం ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, జూలైలో 3శాతం తక్కువ నమోదైంది. ఆదిలాబాద్‌లో 36శాతం ఎక్కువ వర్షపాతం నమోదుకాగా, వరంగల్‌లో 23శాతం, ఖమ్మంలో 20 శాతం ఎక్కువ వర్షపాతం నమోదైంది. ప్రధానంగా మూడు జిల్లాల్లో ఎక్కువ వర్షపాతం నమోదు కాగా, మిగిలిన ఏడు జిల్లాల్లో సాధారణ వర్షపాతం ఉంది. మొత్తం 459 మండలాలకు గాను మూడు మండలాల్లో అత్యల్ప వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని వంగూరులో మైనస్ 72శాతం వర్షపాతం, నల్లగొండ జిల్లాలోని మర్రిగూడలో మైనస్ 68 శాతం, చందంపేటలో మైనస్ 66శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 73 మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.
మహబూబ్‌నగర్ జిల్లాలో 17, నల్లగొండలో 17, రంగారెడ్డిలో 11, మెదక్‌లో 10, హైదరాబాద్‌లో 3, కరీంనగర్‌లో 8, ఖమ్మంలో 4, వరంగల్‌లో 2, నిజామాబాద్ జిల్లాలో ఒక మండలంలో సగటు కన్నా తక్కువ వర్షపాతం నమోదైంది. 208 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది.
175 మండలాల్లో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువ వర్షం పడింది.శుక్రవారం నుంచి సోమవారం వరకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో సాధారణ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఇక ఈనెల 9 నుంచి 12 వరకు మొత్తం రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.