జాతీయ వార్తలు

ఎలాంటి అన్యాయం జరగనివ్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: దేశంలో క్రైస్తవులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వబోమని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం వారికి హామీ ఇచ్చారు. అంతేకాదు, భారతీయ సంస్కృతీ సంప్రదాయాలు, క్రైస్తవ్ర సంస్కృతీ సంప్రదాయాలు రెండూ ఒకటేనని కూడా ఆయన స్పష్టం చేసారు. శుక్రవారం ఇక్కడ క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన ఒక క్రిస్మస్ వేడుకల కార్యక్రమంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడైనా క్రైస్తవులకు అన్యాయం జరిగితే తనను నేరుగా సంప్రదించాలని క్రైస్తవ మత పెద్దలను కోరారు. ‘ మీరు ఏదయినా సమస్యను ఎదుర్కొన్నట్లయితే నేరుగా నన్ను సంప్రదించండి. నేను మీ ఎలాంటి అన్యాయం జరగనివ్వనని బిషప్‌లు, కార్డినాల్స్ అందరికీ హామీ ఇస్తున్నాను’ అని పెద్ద సంఖ్యలో హాజరయిన క్రైస్తవులు, మత పెద్దలు,పలువురు ఎంపీల సమక్షంలో రాజ్‌నాథ్ చెప్పారు. తాను, ఎన్డీయే ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడూ దేశంలోని క్రైస్తవులకు అండగా ఉంటామని, దీనిలో ఎలాంటి సందేహమూ లేదని ఆయన చెప్పారు.
గత ఏడాది ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఢిల్లీలో, దేశంలోని కొన్ని ప్రాంతాల్లో చర్చిలు, క్రైస్తవ సంస్థలపై జరిగిన దాడులను హోం మంత్రి ప్రస్తావిస్తూ, ఆ దాడులు తనను ఎంతగానే బాధించాయని, తక్షణం ఆ దాడులను ఆపడానికి చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించానని ఆయన చెప్పారు. కాకతాళీయమో, కుట్రో తెలియదు కానీ ఈ దాడులన్నీ కూడా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగాయని, ఎన్నికలు ముగిసిన తర్వాత ఆగిపోయాయని అంటూ, ఇలా ఎందుకు జరిగిందో తనకు తెలియదని అన్నారు. ఢిల్లీలో, దేశంలోని ఇతర ప్రాంతాల్లో చర్చిలపై జరిగిన దాడులను ఒక వైపరీత్యంగా ఆయన అభివర్ణించారు. భారత దేశం ఎన్నో ఏళ్లుగా అందరినీ కలుపుకొని పోతున్న దేశం అని, సర్వమత సమభావన భారత దేశం సంస్కృతి అని రాజ్‌నాథ్ చెప్పారు.ఈ సందర్భంగా రాజ్‌నాథ్ క్రైస్తవులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేస్తూ, దేశంలో శాంతి సామరస్యాన్ని కాపాడడానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని క్రైస్తవ మత పెద్దలకు హామీ ఇచ్చారు.
chitram...
భుజ్‌లో మూడు రోజులపాటు జరిగే డిజిపిల సదస్సులో పాల్గొనేందుకు విచ్చేసిన హోమ్‌మంత్రి రాజ్‌నాథ్ సింగ్