జాతీయ వార్తలు

నీట్-2 రద్దు పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 9: వైద్యవిద్యా ప్రవేశపరీక్ష నీట్-2 రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణకు తిరస్కరించింది. మంగళవారం నాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ అనిల్.ఆర్.దవే,జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం ముందుకు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది.పేపర్ లీక్ అయ్యిందన్న కథనాల ఆధారంగా చేసుకొని పరీక్షను రద్దు చేయాలంటూ అన్షుల్ శర్మ సుప్రీంకోర్టు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.దీనికి సంబంధించిన వాదనలను సీనియర్ నాయ్యవాది సంజయ్ హెగ్డే వినిపించారు. ఈ పరీక్ష లీక్ అవ్వలేదని సీబీఎస్‌ఈ,అలాగే నీట్ పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేసిన జస్టిస్ లోధా కమిటి కూడా పేపర్ లీక్ కాలేదని సుప్రీంకోర్టుకు తెలిపాయి. సీబీఎస్‌ఈ,జస్టిస్ లోధా కమిటిలు కూడా పరీక్ష లీక్ ఆవ్వలేదని ప్రకటించిన నేపధ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇందులో జోక్యం చేసుకోబోమని ధర్మాసనం పిటిషన్ ను తిరస్కరించింది.