జాతీయ వార్తలు

సురక్షితం.. కెఎన్‌పిపి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కూడంకుళం (తమిళనాడు), ఆగస్టు 10: ప్రపంచంలోని అత్యంత సురక్షితమైన అణు విద్యుత్ కేంద్రాలలో కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలితతో కలిసి ఆయన కూడంకుళంలోని వెయ్యి మెగావాట్ల సామర్థ్యం గల అణు విద్యుత్ ప్లాంటు-1ను బుధవారం జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీనుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ భారత్‌లో పర్యావరణానికి హాని కలుగని రీతిలో స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని పెంచడానికి చేస్తున్న నిరంతర కృషిలో కూడంకుళం ప్లాంట్-1 ఎంతో ముఖ్యమైనదని, భారత్, రష్యా సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయని చెప్పారు. ‘నేను ఎల్లవేళలా రష్యాతో మన మైత్రికి ఎంతో విలువ ఇస్తుంటాను. మేము సంయుక్తంగా కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం (కెఎన్‌పిపి) యూనిట్-1ను జాతికి అంకితం చేయడం ఇందుకు నిదర్శనం. పర్యావరణ సహిత అభివృద్ధిని సాధించడానికి భాగస్వామ్య పథం నిర్మాణంకోసం సంయుక్తంగా మాకు ఉన్న అంకితభావాన్ని కూడా ఇది ప్రతిబింబిస్తోంది’ అని ప్రధాని అన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాస్కో నుంచి మాట్లాడుతూ అందరికీ ఇది ఎంతో పెద్ద కార్యక్రమం అని అన్నారు. ‘ఈ ప్లాంటు ఏర్పాటుకు రష్యా తాజా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడం జరిగింది. ఇది కేవలం ప్లాంటును నిర్మించడం, ప్రారంభించడం మాత్రమే కాదు. అణు సాంకేతిక పరిజ్ఞాన రంగంలో ప్రపంచంలో అగ్రగామిగా ఉన్న దేశాలలో రష్యా ఒకటనే విషయం అందరికీ తెలిసిందే. మా సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత సహచరులతో కలిసి పంచుకోవడం మాకెంతో సంతోషాన్నిస్తోంది’ అని పుతిన్ అన్నారు. చెన్నై నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత మాట్లాడుతూ భారత్, రష్యాల మధ్య సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న సన్నిహిత స్నేహానికి జ్ఞాపకంగా తిరునెల్వెలి జిల్లాలోని కూడంకుళం వద్ద నిర్మించిన కెఎన్‌పిపి నిలుస్తుందని అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్లపాటు ఈ ప్రాజెక్టు అమలుకు మద్దతిచ్చానని ఆమె గుర్తుచేశారు. రష్యాకు చెందిన వివిఇఆర్ తరహా రియాక్టర్లను ఉపయోగించి, శుద్ధిచేసిన యురేనియం ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు వీలుగా ఈ కెఎన్‌పిపిని నిర్మించారు. కెఎన్‌పిపి రెండోప్లాంటు ఈ సంవత్సరం చివరలో పనిచేయటం ప్రారంభం అవుతుందని అంచనా. స్థానిక ప్రజలు చేసిన ఆందోళన కార్యక్రమాల వల్ల కెఎన్‌పిపి మొదటి ప్లాంటు పూర్తి కావడంలో ఆలస్యం జరిగింది.