జాతీయ వార్తలు

భారత్ ఆరోపణను తోసిపుచ్చిన పాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 10: నియంత్రణ రేఖ వద్ద నుంచి కాశ్మీర్‌లోకి ఉగ్రవాదుల చొరబాట్లను తాను ప్రోత్సహిస్తున్నట్లు భారత్ చేసిన ఆరోపణను పాకిస్తాన్ తోసిపుచ్చింది. నియంత్రణ రేఖ మీదుగా సీమాంతర చొరబాట్లను ప్రోత్సహిస్తున్నట్లు భారత్ చేసిన ఆరోపణను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంగళవారం రాత్రి పేర్కొంది. మరో దేశానికి వ్యతిరేకంగా తమ గడ్డపై ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలకు అనుమతించకూడదనే తన వైఖరికి పాకిస్తాన్ కట్టుబడి ఉందని తెలిపింది. భారత విదేశాంగ కార్యదర్శి ఎస్.జైశంకర్ తన సౌత్ బ్లాక్ కార్యాలయానికి భారత్‌లోని పాకిస్తాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్‌ను పిలిపించుకొని పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని, భారత్‌లోకి చొరబాట్లను ప్రోత్సహించడం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ విదేశాంగ శాఖ స్పందిస్తూ, భారత్ చేసిన వాదనను తోసిపుచ్చింది.