జాతీయ వార్తలు

పాప పరిహారమే ‘నమామి గంగే’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: స్వతంత్ర భారతదేశంలో గంగానదిని కాలుష్యమయం చేసినందుకు నిర్వహిస్తున్న ప్రాయశ్చిత్తమే ‘నమామి గంగే’ (నమామి గంగా యోజన) అని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి అన్నారు. ఈ ప్రచార కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గంగానని పరివాహక ప్రాంతంలోని నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలంతా సహకరించాలని ఆమె కోరారు. ‘నమామి గంగే’ కార్యక్రమాన్ని ఎవరికోసమో చేయడం లేదని, కేవలం గంగానదికోసం చేస్తున్నామని ఆమె అన్నారు. గంగానది పరివాహక ప్రాంతంలో అస్తవ్యస్త రీతిలో ఏర్పడిన పారిశ్రామికీకరణ, పట్టణీకరణ వల్ల కాలుష్యమయమైన గంగానదిని తిరిగి స్వచ్ఛమైన నదిగా తీర్చిదిద్ది భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనపై ఉందని మంత్రి ఉమాభారతిని ఉటంకిస్తూ బుధవారం వెలువడిన ఒక అధికారిక ప్రకటన పేర్కొంది. పవిత్ర గంగానది పరీవాహక ప్రాంతంలో ఉన్న నియోజకవర్గాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చట్టసభల సభ్యులతో బుధవారం ఇక్కడి తన నివాసంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే గంగానది పరివాహక ప్రాంతంలో గల 400 గ్రామాలలో ‘సీచేవాల్ మోడల్’లో వ్యర్థాల నిర్వహణ పనులను చేపట్టిందని ఆమె ఎంపీలకు చెప్పారు. ఈ సీచేవాల్ మోడల్ పర్యావరణ సహితంగా ఉంటుంది.
వృథా జలాలను, మురుగునీటిని శుద్ధి చేయడానికి సహజసిద్ధమైన ప్రక్రియ (నేచురల్ ప్రాసెస్)ను అవలంబిస్తారు. ప్రభుత్వం గంగానది పరివాహక ప్రాంతంలో గల ప్రతి గ్రామంలో సీచేవాల్ మోడల్‌ను అభివృద్ధి చేయడానికి తొలి దశలో రూ. 8లక్షలు వ్యయం చేస్తుందని ఆమె వివరించారు. గ్రామాల పరిశుభ్రత, సుందరీకరణ వంటివి ఈ పనుల్లో భాగంగా ఉంటాయని మంత్రి తెలిపారు.