జాతీయ వార్తలు

లైంగిక వేధింపులకు గురైన ఉద్యోగినులకు మూడు నెలల సెలవు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: లైంగిక వేధింపుల కేసుల విచారణ జరిగే సమయంలో బాధిత ఉద్యోగినులు మూడు నెలల సెలవు తీసుకోవచ్చునని కేంద్రమంత్రి జితేందర్‌సింగ్ లోక్‌సభలో వెల్లడించారు. లైంగిక వేధింపులకు సంబంధించిన కేసుల వివరాలను కేంద్రం నమోదు చేయడం లేదని ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. కార్యాలయాల్లో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధక చట్టంలోని సెక్షన్ 12 ప్రకారం బాధిత ఉద్యోగిని మూడు నెలల సెలవు మంజూరుకు అర్హురాలని ఆయన పేర్కొన్నారు. బాధిత ఉద్యోగిని సెలవు దరఖాస్తును స్థానిక కమిటీలు లేదా అంతర్గత కమిటీల సిఫార్సు మేరకు యాజమాన్యం సెలవు మంజూరు చేయాలని తెలిపారు. ఉద్యోగినులపై లైంగిక వేధింపులకు సంబంధించి ఎన్ని కేసులు నమోదయ్యాయనే సమాచారాన్ని కేంద్రం రికార్డు చేయడం లేదని జితేందర్‌సింగ్ పేర్కొన్నారు.